Advertisement
Google Ads BL

అలియా సీక్రెట్ ని లీక్ చేసిన ఎన్టీఆర్


రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అలియా భట్ కలయికలో జనవరి 7 న విడుదల కాబోయిన ఆర్.ఆర్.ఆర్ మూవీ కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యింది. పక్కా ప్రమోషన్స్ తో రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచిన టైం లో మొదటి రోజు 100 కోట్లు వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టడం ఖాయమని బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ కూడా సినిమాపై అంచనాలు పెంచిన టైం లో ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అవడం అనేది ఫాన్స్ ని తీవ్ర నిరాశపరిచింది. అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగముగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై లో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా జరిగింది. ఆ ఈవెంట్ ప్రీమియర్స్ ని డిసెంబర్ 31 నైట్ జీ ఛానల్స్ లో ప్రసారం చేసారు.

Advertisement
CJ Advs

అయితే ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్, రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన తర్వాత కరణ్ జోహార్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అండ్ అలియా భట్ లతో చిట్ చాట్ చేసారు. అందులో ఎన్టీఆర్ అందరికన్నా ముందు సెట్స్ కి వచ్చేవాడని రామ్ చరణ్ చెప్పగా, సెట్ లో నేను చరణ్ చాలా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం.. కానీ అలియా భట్ మాత్రం వేరే ఆర్(రణబీర్ కపూర్) తో ఫోన్ లో బిజీగా ఉండేది. ఒక్కోసారి వీడియో కాల్ లో ఆ ఆర్ తో మాట్లాడుతుండేది.. ఒకసారి కార్ లో అలియా వీడియో కాల్ లో ఉండగా అని ఎన్టీఆర్ చెబుతుండగా.. అలియా వెంటనే ఎన్టీఆర్ ని వారించింది.. ఆ పిక్ అలాగే ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ అలియా భట్ గురించిన సీక్రెట్స్ అలా ఆ ఈవెంట్ లో బయట పెట్టేసాడు. 

NTR leaks Alia Bhatt Secret:

RRR Mumbai Pre Release Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs