సమంత గత నాలుగేళ్లుగా క్రిష్టమస్ అండ్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని అక్కినేని ఫ్యామిలిలో ఉండి.. నాగ చైతన్య తో కలిసి వెకేషన్స్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకునేది. కానీ ఈసారి సమంత ఒంటరిగా కేవలం స్నేహితులతో న్యూ ఇయర్ తో పాటుగా క్రిష్ట్మస్ ని సెలెబ్రేట్ చేసుకుంది. నాగ చైతన్యతో విడాకులయ్యాక రెండు నెలలు కాస్త సైలెంట్ గా ఉన్న సమంత మళ్ళీ వెకేషన్స్, సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యింది. గత వారం రోజులుగా సమంత పుష్ప ఐటెం సాంగ్ విషయంలో తెగ హైలెట్ అయ్యింది. అయితే న్యూ ఇయర్ రోజున సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.
మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు. వాళ్ళు నమ్మేదేమిటి.. మీ నుంచి వారేం ఆశిస్తున్నారు. అలాంటివి జైలు ఊచలు. ఆ ఊచలు ఎదుటివారి మనసుకే ఉన్నాయని, మీకు కాదని గ్రహించి వీటి నుంచి విముక్తి పొందాలి. మీరేం చెయ్యాలనుకున్నా.. అది చేసే పనులకు ఇతరుల ఇచ్చే సలహాలు అవసరం లేదు. ఒంటరిగా ఉన్నా కూడా నిజమైన వ్యక్తిత్వంతో ఉండండి. ఎవరి క్లాప్స్ మీకు అక్కర్లేదు. అన్ని అర్థం చేసుకుంటే.. మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా బ్రతక గలుగుతారు. అలా ఉంటే ఇంతకుముందు కంటే జీవితంలో ఎక్కువగా గౌరవం కూడా పొందుతారు అంటూ ట్వీట్ చేసింది సమంత.