అనుకున్నదే అయ్యింది.. కరోనా సినీ లవర్స్ మీద పగ తీర్చుకుంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఆర్.ఆర్.ఆర్ కరోనా కారణంగా మూడోసారి వాయిదా పడింది. గత ఏడాది జనవరి 8 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ మూవీ మళ్ళీ దసరా రిలీజ్ అంటూ హడావిడి చేసినా మళ్ళీ సెకండ్ వేవ్ దెబ్బకి.. ఈ ఏడాది జనవరి 7 కి డేట్ మారింది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని ముగించి గత నెలరోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా ఇండియా వైడ్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోలతో రాజమౌళి ఆయా సిటీస్ లో ప్రెస్ మీట్స్ తో చేసిన హడావిడికి సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.
హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి అంతే యాక్టీవ్ గా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చేసారు. కానీ ఓమ్రి కాన్ ఎఫెక్ట్ తో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గించడంతో, చేసేది లేక.. అన్ని రెడీ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్.ఆర్.ఆర్ ని లాస్ట్ మినిట్ లో పోస్ట్ చేసారు. ప్రెజెంట్ సిట్యువేషన్ లో ఇండియా వైడ్ గా థియేటర్స్ క్లోజ్ చెయ్యడంతో.. ఆర్.ఆర్.ఆర్ ని పోస్ట్ పోన్ చేస్తున్నామని, మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించడంతో ఇండియా వైడ్ ఆర్.ఆర్.ఆర్ అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.