గత నెల రోజులుగా రాజమౌళి ఆర్. ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ గా తన హీరోలని వెంట తీసుకుని తెగ కష్ట పడుతున్నారు. రెండేళ్లు ఆర్.ఆర్.ఆర్ మూవీ మేకింగ్ కోసం కష్టపడిన రాజమౌళి.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ సక్రమంగా జనవరి 7 న విడుదలయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇంకేం ఉంటుంది కరోనానే. గత కొన్ని నెలలుగా కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సినిమా లవర్స్ కి ఇప్పుడు ఆశలు నిరాశలయ్యే లా కనిపిస్తుంది ప్రస్తుతం వ్యవహారం. నిన్నటివరకు రాజమౌళి కూడా ఆర్.ఆర్.ఆర్ వాయిదా వేసేదే లేదు.. ఎలాగైనా జనవరి 7 నే మనం పండగ చేసుకుందామని చెబుతూవచ్చారు.
కానీ కరోనా కారణముగా చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, అలాగే పలు చోట్ల కరోనా ఓమ్రికాన్ పెరిగిపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు వాయిదాపడ్డాయి. అలాగే ఢిల్లీలో సినిమా హాళ్లు క్లోజ్ అవడం, అటు చూస్తే ఏపీలో టికెట్స్ రేట్స్ తక్కువగా ఉండడం, ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో నడవడంతో.. రాజమౌళి మరియు దానయ్యలు ఆర్.ఆర్.ఆర్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఇండస్ట్రీలోని వారే ఆర్.ఆర్.ఆర్ విషయంలో కన్ఫ్యూజన్ తో నిండిన పోస్ట్ లు పెట్టడంతో.. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీ వాయిదా తప్పేలా లేదు అంటున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఏ మినిట్ అయినా ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ విషయం ప్రకటించడానికి సిద్దమయ్యారనే న్యూస్ నడుస్తుంది.
దానితో ఫాన్స్, ఆర్.ఆర్.ఆర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆర్.ఆర్.ఆర్ వాయిదా అనగానే.. నిరాశ పడిపోతున్నారు.