Advertisement
Google Ads BL

100 కోట్ల పారితోషకం ఎవరిస్తారండి


ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి ఆయన పీఆర్ టీం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. రామ్ చరణ్ ఏ సిటీలో అడుగుపెట్టినా, ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కి వెళ్లినా. టాలీవుడ్ లో ఆయన పిఆర్ టీం అలెర్ట్ అయ్యిపోతుంది.. రామ్ చరణ్ ఫాన్స్ హంగామా, అక్కడ ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఫాన్స్ గోల, బారిగేడ్స్ తోసుకుని మరీ రచ్చ చేసారు అంటూ ప్రచారం షురూ చెయ్యడమే కాదు.. రామ్ చరణ్ రేంజ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఓ రేంజ్ లో పెరిగినట్లుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ 100 కోట్లు పారితోషకం అందుకోబోతున్నాడంటూ ఓ న్యూస్ ని స్ప్రెడ్ చేసారు.. సదరు టీం.

Advertisement
CJ Advs

మరి 100 కోట్ల పారితోషకం అంటే మాములు విషయం కాదు.. అందుకే రామ్ చరణ్ ఎక్కడ కనిపించినా.. ఏంటి ఆర్.ఆర్.ఆర్ తర్వాత మీ పారితోషకం 100 కోట్లు అంటున్నారు.. ఇందులో నిజమెంత అని అడగ్గానే.. రామ్ చరణ్ మాత్రం ఎక్కడున్నాయండి వంద కోట్లు, ఎవరిస్తారండి 100 కోట్లు అంటూ అవన్నీ అసత్యాలుగా కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి.. ఉన్నా నాకెవరు ఇస్తారు.. అంటూ తిరిగి చరణ్ ప్రశ్నించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి రామ్ చరణ్ రేంజ్, క్రేజ్ పెరిగింది అని చెప్పడానికే రామ్ చరణ్ సీక్రెట్ పీఆర్ టీం ఇలా చేస్తే.. స్వయంగా రామ్ చరణ్ కొట్టిపారెయ్యడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  

Ram Charan Clarity On Rs 100 Crore Remuneration:

Ram Charan funny reaction on his next movie remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs