అజిత్, విజయ్ ఫాన్స్ ని అలా బుట్టలో వేశారు


తమిళంలో హీరో అజిత్, హీరో విజయ్ అంటే విపరీతమైన పాపులారిటీ ఉన్న హీరోలు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు వీళ్ళే. విజయ్ - అజిత్ ఫాన్స్ తరుచూ సోషల్ మీడియాలో గొడవ పడుతుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. ఇక అజిత్, విజయ్ లు పాలిటిక్స్ లోకి వస్తారని అన్నా వారెప్పుడు అంతగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూయించింది లేదు. అయితే ఇప్పుడు ఈ హీరోల ఫాన్స్ ని ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి, హీరో ఎన్టీఆర్ బుట్టలో పడేసారు. ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్స్ లో భాగంగా ముంబై లో సల్మాన్ ని గెస్ట్ గా పిలిచిన రాజమౌళి, చెన్నై కి వచ్చేసరికి అజిత్ కానీ విజయ్ ని కానీ గెస్ట్ లుగా పిలుస్తారని ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఆ హీరోలెవరూ ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో కనబడలేదు.

కానీ ఓ తమిళ షో లో రాజమౌళి అజిత్ ని ఆకాశానికెత్తేశారు. అజిత్ చాలా సింపుల్ గా ఉండే హీరో అని, డౌన్ టు ఎర్త్ హీరో అని కొనియాడారు. అంతేకాదు.. అజిత్ ఓ హోటల్ లో భోజనం చేస్తూ కనిపించారు. నెను అదే హోటల్ లో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్లకుండా వేరే టేబుల్‌లో కూర్చొని నా వైఫ్ రమా కోసం ఎదురుచూస్తున్నా. నన్ను అక్కడ చూసిన అజిత్‌ నా దగ్గరికి వచ్చి.. సర్‌. ఎలా ఉన్నారు? అని పలకరించారు. మేమిద్దరం మాట్లాడుకుంటున్న టైం లో రమా అక్కడికి వచ్చి నాకోసం చూస్తోంది. అప్పుడు అజిత్ రమా దగ్గరికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుని టేబుల్ వద్దకి తీసుకొచ్చారు. ఎంతోమంది ఫాన్స్ ఉన్న అజిత్ అంత సీదాగా ఉండడం షాకిచ్చింది. అంతేకాదు. ఈమధ్యన అజిత్ తలా అని తన పేరు ముందు తీసెయ్యమని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది అంటూ అజిత్ ఫాన్స్ ని రాజమౌళి పడేసారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో స్టార్ హీరో విజయ్ గురించి మట్లాడుతూ.. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం..  విజయ్ సూపర్ స్టార్.. అలాగే నాకో గురువు. స్నేహితుడు, బ్రదర్.. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాము. మాస్టర్ రిలీజ్ అయిన టైములో నేను విజయ్ కి ఫోన్ చేశాను. ఎంతో ఫ్యాన్ బేస్, స్టార్ డం ఉన్న విజయ్ లో ఆ గర్వం ఎప్పుడూ చూడలేదు అంటూ విజయ్ ఫాన్స్ ని ఎన్టీఆర్ పడేసారు. అలా రాజమౌళి, ఎన్టీఆర్ అజిత్, విజయ్ ఫాన్స్ హోల్సేల్ గా బుట్టలో వేశారు. 

Rajamouli and NTR about Ajith and Vijay:

Rajamouli praises this Kollywood actor Ajith
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES