Advertisement
Google Ads BL

లైగర్ గ్లిమ్ప్స్: విజయ్ దేవరకొండ షో


టాలీవుడ్ స్టార్ హీరో గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ డం ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కి మాస్ దర్శకుడు పూరి జగన్నాద్ తోడవడంతో.. పూరి - విజయ్ లు కలిసి పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. అందులో భాగంగానే లైగర్ స్క్రిప్ట్ కాస్తా పాన్ ఇండియా స్క్రిప్ట్ గా మారింది. అప్పటినుండి విజయ్ దేవరకొండ లైగర్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. పూరి - ఛార్మి లకి తోడు బాలీవుడ్ బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ తోడవడంతో.. సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయాయి. ఇక బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటించడం, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా భాగమవడంతో.. అటు బాలీవుడ్ లోను సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Advertisement
CJ Advs

వచ్చే ఏడాది ఆగష్టు లో రిలీజ్ డేట్ ప్రకటించిన లైజర్ టీం.. ప్రమోషన్స్ ఈ ఏడాది చివరి నుండే షురూ చేసింది. లైగర్ గ్లిమ్ప్స్ డిసెంబర్ 31 న ఇంకా లైగర్ అప్ డేట్స్ అంటూ అందరిని ఊరించింది. ఇక నేడు డిసెంబర్ 31 న లైగర్ గ్లిమ్ప్స్ వదిలింది టీం. ఈ గ్లిమ్ప్స్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా విశ్వరూపం కాదు.. గ్లిమ్ప్స్ మొత్తం విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. లేడీస్ అండ్‌ జెంటిల్‌మేన్‌ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. MMA వరల్డ్ ఛాంపియన్స్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబయి వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్‌, చాయ్‌ వాలా.. ది లైగర్‌ అంటూ విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ అదిరింది. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ ఛాయ్ అమ్ముకునే వాళ్ళ, ముంబై స్లం డాగ్ లా విజయ్ మేకోవర్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. వి ఆర్‌ ఇండియన్స్‌ అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ కి రౌడీ ఫాన్స్ కి పూనకాలే.. మరి లైగర్ ఒకే ఒక్క అప్ డేట్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి పెంచేలా చేసింది. 

Liger first glimpse shows Vijay Devarakonda power:

<span>Liger first glimpse: Rowdy Star powerful punch in an action avatar</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs