Advertisement
Google Ads BL

షణ్ముఖ్ తో దీప్తి సునయన తెగతెంపులే


బిగ్ బాస్ రన్నర్ షణ్ముఖ్ ఆ పదవిని ఆ క్రేజ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.  ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరి తో అలాంటి రచ్చ చేసాడు కాబట్టి. సిరి ని ఫ్రెండ్ అంటూనే హగ్గులు, ముద్దులతో షణ్ముఖ్ చాలా నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. హౌస్ లో ఉన్నప్పుడే ఫాన్స్ నుండి షణ్ముఖ్ షాక్ తగిలించింది కాబట్టే విన్నర్ అవ్వాల్సిన వాడు కాస్తా రన్నర్ గా మిగిలిపోయాడు. ఇక బయటికి వచ్చాక ఏ ఇంటర్వ్యూ చూసినా షణ్ముఖ్ -సిరి ల వ్యవహారమే నడుస్తుంది. అందుకే షణ్ముఖ్ కూడా ఎక్కువగా ఛానల్స్ ఇంటర్వూస్ ఇవ్వడం లేదు. ఇక షణ్ముఖ్ లవర్, గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కూడా వదిలేస్తుంది అనే న్యూస్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

దీప్తి సునయన షణ్ముఖ్ కి డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పకుండా.. అతన్ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చెయ్యడం, అలాగే సోషల్ మీడియాలో పొంతనలేని కామెంట్స్ తో అందరిలో అనుమానాలు, ఆసక్తి రేకెత్తించింది. ఇక తాజాగా దీప్తి సునయన మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ మారక తప్పేలా లేదు అంటూ పోస్ట్ చెయ్యడంతో.. ఇక దీప్తి సునయన - షణ్ముఖ్ బందానికి బ్రేకప్ తప్పదు అంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. కొంతమంది దీప్తి సునాయానకి సపోర్ట్ చెయ్యడం చూస్తే షణ్ముఖ్ తో దీప్తి విడిపోవడం ఖాయమనే అనిపిస్తుంది. షణ్ముఖ్ మాత్రం దీప్తి సునాయనాని విడిచిపెట్టేది లేదు అంటున్నాడు.. చూద్దాం షన్ను నమ్మకం ఏమవుతుందో అనేది.

Deepthi Sunaina indirect reacts on Shanmukh:

Deepthi Sunaina Latest Post Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs