Advertisement
Google Ads BL

ఏపీ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్


గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం థియేటర్స్ లో తనికీలు చేస్తూ.. కొన్ని థియేటర్స్ ని సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సీజ్ చెయ్యడంతో, కొంతమంది థియేటర్స్ యజమానులు స్వచ్చందంగా థియేటర్స్ మూసివేస్తున్నారు. అయితే తాజాగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మూసివేసిన థియేటర్స్ ని తిరిగి తెరిచేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

Advertisement
CJ Advs

ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున కొన్ని విన్న‌పాలు చేసుకోవ‌డం జ‌రిగింది. అందులో మొద‌టగా థియేట‌ర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ముఖ్య‌మంత్రి గౌర‌వ‌నీయులు శ్రీ వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిగారికి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్  తరపున కృత‌జ్ఞ‌త‌లు. మిగ‌తా విన్న‌పాల ప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించి మ‌మ్మ‌ల్ని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

AP govt permit theatres to reopen:

<div>AP govt's relief to theatres: Telugu Distribution Council thanks</div> <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs