బాలకృష్ణ లేటెస్ట్ చిత్రంతో హీరో శ్రీకాంత్ కాస్తా విలన్ శ్రీకాంత్ అయ్యాడు. గతంలో లెజెండ్ మూవీ తో జగపతి బాబు విలన్ అవతారం ఎత్తడమే కాదు.. విలన్ గానే సెటిల్ అయ్యారు. ఇక అఖండ మూవీలో బాలకృష్ణ ని ఎదిరించిన శ్రీకాంత్ కూడా విలన్ గా సెటిల్ అవుతాడని అనుకున్నా.. ఎందుకో అఖండ మూవీ లో శ్రీకాంత్ విలనిజం ని బోయపాటి హైలెట్ చెయ్యలేదు. అంతా బాలకృష్ణ మీదే నడిచింది. ఇక బాలకృష్ణ అఖండ మ్యానియా ముగిసింది. ఆయన తదుపరి చిత్రం NBK107 మొదలు కాబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 షూట్ లో బాలయ్య త్వరలోనే పాల్గొనబోతున్నారు.
ఈ సినిమాలో పవర్ ఫుల్ కేరెక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుండగా.. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య విలన్ గా అర్జున్ ని అనుకుంటున్నారట. గతంలోనే అర్జున్ లై సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు. మరి బాలకృష్ణ తో పోటీ పడేది అర్జున్ అయితే.. బాలయ్య - అర్జున్ కాంబో ఫ్రెష్ గా ఉంటుంది. ఇక అర్జున్ - బాలయ్యలు ఒకేసారి కెరీర్ లో ఎంటర్ అయ్యి హిట్స్ కొట్టడంతో.. ఇప్పుడు వీరిద్దరూ తలపెడితే ఆ కాంబో కొత్తగా ఉండడం ఖాయం అంటున్నారు నందమూరి ఫాన్స్.