Advertisement
Google Ads BL

ఈసారి అయినా శర్వానంద్ హిట్ కొడతాడా?


పాపం శర్వానంద్! ఇతను హిట్ కొట్టి ఎన్నాళ్ళు అవుతోందో? వరస ప్లాప్స్ తో ప్రస్తుతం ఈ యంగ్ హీరో టెంక్షన్స్ లో ఉన్నాడు. ఆ మధ్య శర్వా హిట్ అవుతుంది అనుకున్న మహా సముద్రం తుస్సుమంది. పోనీ అది వొదిలెద్దాం, దాని ముందు సినిమా శ్రీకారం కు కూడా శర్వానంద్ చాలా పెద్ద ఎక్సపెక్టషన్స్ పెట్టుకున్నారు, అది హిట్ అయినా ప్లాప్ లిస్ట్ లో చేరింది. ఇలా అన్ని సినిమాలు మనసుకు దగ్గరయిన సినిమాలే అని చెప్తున్నారు కానీ, ప్రేక్షకులు మాత్రం వాటిని సరిగా రిసీవ్ చేసుకోవడం లేదు. ఎక్కడో ఎదో లోపం జరుగుతోంది. 

Advertisement
CJ Advs

జాను, దాని ముందు పడి పడి లేచే మనసు, ఇలా చెప్పుకుంటే అన్నిటి మీద శర్వానంద్ మనసు పెట్టే కష్టపడి చేసాడు. కానీ ఫలితం మాత్రం సూన్యం. ఇప్పుడు ఒకే ఒక జీవితం అన్న సినిమా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది కూడా గతంలో చెప్పినట్టుగా మనసుకి, తనకి దగ్గర సినిమా అంటున్నాడు. దగ్గర దగ్గర ఐదేళ్లు అవుతోంది శర్వానంద్ ఒక మంచి పెద్ద హిట్ కొట్టి. ఈసారి అయినా పాపం ఈ ఒకే ఒక జీవితం అతనికి ఆ బ్రేక్ ఇస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే. ఇక తర్వాత శర్వానంద్ చేస్తున్న మరో సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక ఉంది.. మరి రష్మిక అయినా శర్వా లక్ మారుస్తుందేమో చూడాలి.

Will Sharwanand hit this time too?:

Sharwanand Oke Oka Jeevitham Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs