మెగా హీరో రామ్ చరణ్ - నందమూరి హీరో ఎన్టీఆర్ కలయికలో బాహుబలి జక్కన్న తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ వేడి వేడిగా సాగుతున్నాయి. ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ రోజు బుధవారం కేరళలో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలని టీం అంగరంగ నిర్వహించడంతో.. హీరోల ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ముంబైలో రామ్ చరణ్ ఫాన్స్ ని, ఎన్టీఆర్ ఫాన్స్ ని కంట్రోల్ చెయ్యడం కష్టమైపోయింది. చెన్నై లోనూ చెర్రీ ఫాన్స్ రెచ్చిపోయి బారిగేడ్స్ విరగ్గొట్టేసారు. హైదరాబాద్ ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లోను మెగా ఫాన్స్ చేసిన రచ్చ కి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితి.
ఇక తాజాగా కేరళలో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ రాష్ట్ర సీఎం హాజరవడం హాట్ టాపిక్ అయితే.. అక్కడ కూడా రామ్ చరణ్ ఫాన్స్ చరణ్, చరణ్ అంటూ బ్యానెర్లు కట్టడం, చరణ్ ఫోటో కార్డ్స్ తో, అల్లూరి లుక్ తో బ్యానెర్లు ఏర్పాటు చెయ్యడం, ఫాన్స్ అలా రచ్చ చెయ్యడం చూస్తే చరణ్ కి కేరళలో ఎంతగా ఫాలోయింగ్ ఉందో అర్ధమవుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి వస్తుంటే.. అక్కడ చరణ్ ఫాన్స్ జై చరణ్, జై రామ్ చరణ్ అంటూ గోల గోల చేసారు. కేరళ మలయాళ ఇండస్ట్రీలో అల్లు అర్జున్.. మల్లు అర్జున్ గా ఎంతగా పాపులర్ అయ్యాడో.. ఇప్పడు రామ్ చరణ్ ఒక్క సినిమా కూడా అక్కడ విడుదల కాకుండానే.. చెర్రీ కోసం ఫాన్స్ రచ్చ చూస్తే ఇంత ఫాలోయింగ్ ఉందా చరణ్ కి అనిపిస్తుంది.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో అదరగొట్టేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ కి అన్ని భాషల్లో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడం ఖాయంగా కనబడుతుంది. ప్రస్తుతం కేరళలో రామ్ చరణ్ ఫాన్స్ చేస్తున్న రచ్చ ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.