Advertisement
Google Ads BL

లైగర్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్


పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  

Advertisement
CJ Advs

లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ అప్డేట్లను ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తాజాగా డేట్ అండ్ టైమ్ ప్రకటించారు. లైగర్ మ్యాడ్ నెస్ను వీక్షించేందుకు రెడీగా ఉండండి.. డిసెంబర్  31న ఉదయం 10:03 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.

డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్ ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నారు.

ఇండియాలోనే అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.  

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.

LIGER First Glimpse Date And Time Locked:

<span>Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur&rsquo;s Pan India Film LIGER (Saala Crossbreed) First Glimpse Date And Time Locked</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs