Advertisement
Google Ads BL

కరోనా భయపెట్టినా.. బాక్సాఫీసు కూల్ చేసింది


2021 కరోనా పాండమిక్ సెకండ్ వేవ్ తో ఒణికించినా.. మళ్ళీ అందరూ సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ ని అతలాకుతలం చేసిన కరోనా.. కాస్త శాంతించడంతో.. ఇండస్ట్రీ మళ్ళీ యదాస్థితికి రావడం ఈ ఏడాది మొదట్లోనే జనవరి నుండి బాక్సాఫీసు కళకళలాడింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మధ్య వరకు థియేటర్స్ దగ్గర హిట్ మూవీస్, ప్లాప్ మూవీస్ సందడి చేసాయి. మళ్ళీ సెకండ్ వేవ్ తో ఇండస్ట్రీ సైలెంట్ అయ్యింది. జులై నుండి థియేటర్స్ తెరుచుకోవడం, సినిమాలు కూడా వరసగా రిలీజ్ అయ్యాయి.  అలా ఏడాది చివరికి వచ్చేసాం. మరో రెండు రోజుల్లో 2022 లోకి అడుగుపెట్టేస్తున్నాం.

Advertisement
CJ Advs

ఇక 2021  డిసెంబర్ లో మూడు బిగ్గెస్ట్ హిట్స్ తో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. డిసెంబర్ 2 న రిలీజ్ అయిన బాలకృష్ణ అఖండ మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాతో బాక్సాఫీసు దగ్గర పెద్ద సినిమాలకి ఊపొచ్చింది. ఇక తర్వాత డిసెంబర్ 17 న పుష్ప తో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టాడు. ఆ సినిమా అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక డిసెంబర్ చివరి వారం క్రిష్టమస్ వీక్ లో నాని శ్యామ్ సింగ రాయ్ తో భారీ హిట్ కొట్టి.. 2021 కి హ్యాపీ గా ఎండ్ కార్డు వెయ్యబోతున్నాడు. నాని శ్యామ్ సింగ్ రాయ్ విడుదలైన నాలుగు భాషల్లో పాజిటివ్ టాక్ తోనూ, అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కరోనా పాండమిక్ భయపెట్టినా.. ఈ నెలలో మూడు భారీ  హిట్స్ తో 2021 ని ఆనందంగా ఎండ్ చెయ్యడం ఇండస్ట్రీకి ఊపునిచ్చింది. ఈ నెలలో రిలీజ్ అయిన మూడు పెద్ద సినిమాలు మంచి హిట్స్ అవడంతో.. ఈ ఇయర్ ని గ్రాండ్ గా ఎండ్ చేసి.. న్యూ ఇయర్ కి కిక్ ఇచ్చేలా వెల్ కం చెబుతుంది టాలీవుడ్.

మరి 2022 జనవరిలో ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్ టాలీవుడ్ కి ఎలాంటి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నాయో చూద్దాం. 

Corona scared but, The box office was cool:

Telugu cinema in 2021: Several small gems and a few big ones
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs