సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నాం అంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారు భీమ్లా నాయక్ మేకర్స్. జనవరి 12 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ - రానా కాంబో భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అంటూ అనౌన్స్ చెయ్యడమే కాదు.. మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ చాలా స్పీడుగా వున్నారు. భీమ్లా నాయక్ నుండి టీజర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్రేజీగా హైప్ క్రియేట్ చేసారు. పాన్ ఇండియా మూవీ తో పోటీగా భీమ్లా నాయక్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసారు. కానీ పాన్ ఇండియా మూవీ కి అడ్డం పడడం ఇష్టం లేని భీమ్లా నాయక్ మేకర్స్.. సినిమాని ఫిబ్రవరి 25 కి రిలీజ్ ని షిఫ్ట్ చేసారు.
దానితో భీమ్లా నాయక్ అప్ డేట్స్ ఇక ఇప్పట్లో ఉండవని పవన్ ఫాన్స్ ఫీలయ్యారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యాం ప్రమోషన్స్ తప్ప.. మిగతా హీరోలెవరు ప్రమోషన్స్ కి దిగరనుకుంటే.. రేస్ నుండి తప్పుకున్నాం.. కానీ ప్రమోషన్స్ నుండి కాదు అంటున్నారు భీమ్లా నాయక్ మేకర్స్. రేపు ఉదయం భీమ్లా నాయక్ నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. To all the MIGHTY fans, a POWERful update is ready to erupt FireDrum Gear Up & Stay Tuned to @SitharaEnts at 11am, Tomorrow Collision symbol అంటూ అప్ డేట్ ఇవ్వడంతో ఆ పవర్ ఫుల్ అప్ డేట్ పై ఫాన్స్ లో ఆత్రుత పెరిగిపోతుంది. పవన్ భీమ్లా నాయక్ లుక్, రానా డ్యానియల్ శేఖర్ లుక్స్ కి ప్రేక్షకులు మైమరిచిపోయారు. పవన్ కళ్యాణ్ మాస్ యాక్టింగ్ కి, రానా ఈగో యాక్టింగ్, అలాగే సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే పై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.
మరి సంక్రాంతికి భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి ఉంటే.. ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో గండి పడేదే.. అందుకే పవన్ భీమ్లా నాయక్ మేకర్స్ ని ఒప్పించి సంక్రాంతి బరి నుండి తప్పించారు.