Advertisement
Google Ads BL

టాలీవుడ్ హీరోలపై బాలీవుడ్ ప్రేమ


బాహుబలి టైం లో బాలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ హీరోలని పొగడాలంటే ఈగో అడ్డొచ్చేది. కానీ బాహుబలి నుండి ఆర్.ఆర్.ఆర్ టైం కి బాలీవుడ్ మైండ్ సెట్ మారింది. టాలీవుడ్ హీరోలని పొగుడుతున్నారు.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు. రాజమౌళి టాలెంట్ కి అక్కడి హీరోలు ఫిదానే కానీ.. బయటికి చెప్పరు.. కారణం ఈగో.. ఈగో. బాహుబలి భారీ హిట్ అయినా.. బాలీవుడ్ లో ఒక్క హీరో కూడా ఆ సినిమాని పొగడలేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో రాజమౌళి బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే మరో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ రాబోతుంది. నిన్నగాక మొన్నతరుణ్ ఆదర్శ్.. టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ వలన బాలీవుడ్ కి ప్రమాదం అంటూ స్వీట్ గా కామెంట్ చేసాడు. ఇక నేడు కరణ్ జోహార్ టాలీవుడ్ హీరోలని ఓ రేంజ్ లో పొగిడేసాడు. 

Advertisement
CJ Advs

కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఇప్పటికే లైగర్ మూవీ కి వన్ అఫ్ ద నిర్మాతగా మారారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ హిందీలో ఫస్ట్ డే 30 కోట్లు కలెక్ట్ చెయ్యడం గ్యారెంటీ అంటున్నారు.. అంతేకాదు.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 100 కోట్లు ఆర్.ఆర్.ఆర్ కొల్లగొడుతుంది అంటున్నారు ఆయన. బాహుబలి వరకు ప్రభాస్ అంటే హిందీలో ఎవరికీ తెలియదు. బాహుబ‌లి 1తో పాన్ ఇండియా అంటే ఏమిటో బాలీవుడ్ కి మాత్రమే కాదు అందరికి తెలిసింది. గతంలో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అంతా ఇండియ‌న్ సినిమా అయిపోయింది. ఎన్టీఆర్‌, చ‌రణ్‌లు తెలుగు ప్రేక్షకులకి స్టార్ హీరోలు.. కానీ హిందీలో ఎన్టీఆర్ అంటే ఎవ‌రికీ తెలీదు. రామ్ చ‌ర‌ణ్ అన్నా తెలీదు. కానీ బాహుబలి వీరుడు రాజ‌మౌళి బ్రాండ్ వాల్యూ ఏమిటో తెలుసు. అందుకే ఆర్.ఆర్.ఆర్ 30 కోట్లు వ‌సూలు చేయ‌డం అంటే మాట‌లు కాదు అంటున్నారు కరణ్ జోహార్. భారీ వసూళ్లు కొల్లగొడుతుంది. జస్ట్ ఓ ప్రెస్ మీట్ పెట్టి, పోస్టర్స్ వదిలిన పుష్ప బాలీవుడ్ ప్రేక్షకులని ఫిదా చేసింది. 

అల్లు అర్జున్ కి హిందీ లో డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు హిందీలో డబ్ అవుతాయి. ఇక నా ఆఫీస్ కి నిత్యం చాలామంది వస్తారు. హీరోలు, దర్శకులు ఇలా చాలామంది వస్తారు. కానీ ప్రభాస్ వచ్చినప్పుడు నా ఆఫీస్ మార్మోగిపోయింది. ఇది వాళ్ళ కష్టముతో సంపాదించుకున్న క్రేజ్ అంటూ కరణ్ జోహార్ టాలీవుడ్ పై ప్రేమని కురిపిస్తున్నారు.  

Karan Johar lavishes praise on Telugu cinema:

Karan Johar Talks about Tollywood Star Heroes and Rajamouli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs