Advertisement
Google Ads BL

దయచేసి సిరిని నెగెటివ్ చెయ్యకండి


బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కూడా సిరి ని షణ్ముఖ్ లని సోషల్ మీడియాలో తెగ నెగెటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లో చేసిన పనికి అందరూ వాళ్ళని నెగెటివ్ గానే చూస్తున్నారు. ఆ విషయాన్ని షణ్ముఖ్ పదే పదే ఒప్పుకుంటున్నాడు. సిరి ఒప్పుకోవడం లేదు కానీ.. షణ్ముఖ్ మా బిహేవియర్ చాలామందికి నచ్ఛలేదు.. అదే నెగెటివ్ గా తీసుకున్నారు అంటున్నారు. హౌస్ నుండి బయటికి వచ్చాక ఇన్స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్ తాను సిరిని ప్రొటెక్ట్ చేస్తున్నా అనుకుని ఎక్కువ కేర్ తీసుకున్నాను, బహుశా మా ఫ్రెండ్ షిప్ అందరికి నచ్చకపోవచ్చు, బయటికి వచ్చాక నెగెటివ్ కామెంట్స్ చూస్తే అర్ధమైంది.

Advertisement
CJ Advs

నేను ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడలేదు. ఇక కెరీర్ విషయంలో వెబ్ సీరీస్ చెయ్యాలా, హీరోగా వెండితెర మీద కి రావాలా అనేది ఇంకా ఆలోచించలేదు అని, న్యూ ఇయర్ తర్వాత చూస్తానని చెప్పిన షణ్ముఖ్ సిరిని నెగెటివ్ చెయ్యకండి, సిరి తప్పేం లేదు, మేము ఫ్రెండ్లీ గా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము, మేము హౌస్ ఎలా ఉన్నామో, బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కూడా అలానే ఉంటాము అంటూ ఫాన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సిరిని దయచేసి నెగెటివ్ గా ట్రోల్ చెయ్యొద్దు అంటూ వేడుకుంటున్నాడు. ఇక దీపు తో బ్రేకప్ వ్యవహారం దీప్తి సునయనతో మాట్లాడి తేల్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

Bigg boss Shanmukh chit chat with fans:

Shanmukh comments on Siri Negativity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs