రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని వేరే లెవెల్ అనేలా చేస్తున్నారు. సినిమా తెలియని వాడికి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఉంది అంటూ ప్రేక్షకుల మైండ్ సెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా రాజమౌళి, ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా అలాగే ఏ సిటీలో అంటే ఐదు భాషల్లో బెంగుళూర్, చెన్నై, ముంబై, తెలుగు.. ఇలా ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ మాటే, ఆర్.ఆర్.ఆర్ పాటే. కానీ మరో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ హడావిడి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ముగిసిపోయింది అనిపిస్తుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అభిమానులే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన ప్రభాస్ మళ్ళీ చడీ చప్పుడు లేదు.
రాధేశ్యామ్ ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా. ప్రభాస్ ఐదు భాషల్లోనూ రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. సినిమా రిలీజ్ కి 15 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ పదిహేను రోజుల్లోనే ప్రభాస్.. అన్ని భాషల్లో ప్రమోషన్స్ ముగించేయాలి. కానీ ఇంతవరకు ప్రభాస్ కానీ టీం కానీ కనిపించింది లేదు. అసలే కరోనా థర్డ్ వెవ్ అంటున్నారు. మళ్ళీ ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించాలి అంటే సినిమాపై హైప్ క్రియేట్ అవ్వాలి. అందుకు ప్రమోషన్స్ ఒక్కటే దారి. ప్రభాస్ సాహో తర్వాత అయినా రియలైజ్ అవ్వాల్సింది. కానీ రాధేశ్యామ్ విషయంలోనూ ప్రభాస్ అలానే కనిపిస్తున్నాడు. ఓ నేషనల్ ఈవెంట్ పెడితే చాలు.. ఇక ఏం అక్కర్లేదు అనుకున్నాడేమో.. అందుకే ఈ సైలెంట్. ఏదైనా ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో ఆర్.ఆర్.ఆర్ ని చూసాక ఎవ్వరు ఎంతగా చేసినా.. అవి చాలా తక్కువగానే అనిపిస్తున్నాయి తప్ప ఇంట్రెస్టింగ్ గా అనిపించడం లేదు.