Advertisement
Google Ads BL

న్యూ ఇయర్ కి మల్టిపుల్ అప్డేట్స్‌ తో లైగర్


పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్)లో డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చివరి షెడ్యూల్‌ను ఇండియాలో షూట్ చేయబోతోన్నారు.

Advertisement
CJ Advs

ఇది వరకు ప్రకటించినట్టుగానే `ఆగ్ లగా దేంగే..` అంటూ లైగర్ ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు స‌రికొత్త  అప్డేట్లతో చిత్రయూనిట్ ముందుకు వచ్చింది. డిసెంబర్ 29న ఉదయం 10:03 గంటలకు ది బిగ్ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేయబోతోన్నారు.

డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్‌లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్‌ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇన్ స్టా ఫిల్టర్‌ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాది చివర్లో మాత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఇకపై లైగర్ టీం నుంచి వచ్చే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ల కోసం రెడీగా ఉండండి అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇండియాలోనే అత్యంత భారీగా నిర్మిస్తున్న యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. మార్షల్ ఆర్ట్స్‌తో నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అభిమానులే కాకుండా సినీ ప్రేమికులకు కూడా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. విజయ్ దేవరకొండ మైక్ టైసన్ మధ్య వచ్చే సన్ని వేశాలు ఊపిరి బిగపట్టుకునేలా ఉండ‌నున్నాయి. యాక్షన్ మూవీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఫస్ట్ గ్లింప్స్ ట్రీట్‌లా ఉండబోతోంది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.

ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం టీం అంతా కూడా ప్రాణం పెట్టి పని చేసింది. లైగర్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం అర్జున్ రెడ్డి కూడా ఆగస్ట్ 25న విడుదలైంది. అలా లైగర్ కూడా విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో కల్ట్ చిత్రంగా మారనుంది.

Pan India Film LIGER Multiple Updates Ahead Of New Year:

<span>Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur Pan India Film LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs