ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రాజమౌళి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పేర్లు, RRR అంటూ అభిమానుల కోలాహలం మధ్యన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. కేవలం 10 రోజులు మాత్రమే రిలీజ్ టార్గెట్ తో ఉన్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ ఈ పది రోజుల్లో ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయో అనే ఊహలోనే ప్రేక్షకులు, ఫాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ వీరిద్దరూ అనేకచోట్ల కలిసి కనిపిస్తున్నా ఫాన్స్ కి బోర్ కొట్టడం లేదు.. సరికదా రోజు రోజు కి కొత్తగా అనిపిస్తుంది. రీసెంట్ గా చెన్నై లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఉదయనిధి స్టాలిన్, శివ కార్తికేయన్ గెస్ట్ లుగా హాజరైన ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడిన ప్రతి మాట ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ తో తన స్నేహం అద్భుతం అని.. ఎన్టీఆర్ హార్డ్ కొర్ ఫాన్స్ కి థాంక్స్ ని చెప్పిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ తన ప్రాణ స్నేహితుడు అని, ఎన్టీఆర్ తనకన్నా వయసులో ఓ ఏడాది గ్యాప్ ఉన్నా.. నాకు సొంత బ్రదర్ తో సమానం అని, అంతేకాదు.. ఎన్టీఆర్ ది చిన్న పిల్లల మనస్తత్వం, పర్సనాలిటీలో సింహం అని, ఒక రకంగా ఎన్టీఆర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చరణ్ మాట్లాడాడు. చనిపోయే వరకు ఎన్టీఆర్ తో స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నాను, ఎన్టీఆర్ కి థాంక్స్ కూడా చెప్పను, అలా అయితే మా బంధం దూరం అయినట్లే.. కానీ దేవుడికి థాంక్స్ చెబుతాను.. ఇంత మంచి ఫ్రెండ్ ని నాకిచ్చినందుకు.. అంటూ చరణ్ ఎన్టీఆర్ ని ఎత్తెయ్యడమే కాదు.. ఎమోషనల్ స్పీచ్ తో అదరగొట్టేసాడు.
ఇంకా రాజమౌళి తనకి మొదటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అని, ఆర్.ఆర్.ఆర్ మూవీ అందరికి నచ్చుతోంది అంటూ చరణ్ మాట్లాడిన మాటలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కె హైలెట్ గా నిలిచాయి.