ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు ఇండియా వైడ్ గా విపరీతంగా ట్రెండ్ అవుతున్న హీరోలు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసే సందడికి ఫాన్స్ కి పండగే అన్నట్టుగా ఉంది. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై ఇలా ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు ఈ హీరోలు. ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి వేరే వేరే ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళిన అంటే.. హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ పెట్టినా ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ వచ్చేసి.. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్ అంటూ రచ్చ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ రచ్చ యూట్యూబ్ ఛానల్స్ లో చూసాము.
ఇక తాజాగా చెన్నై లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ అరవడం, రామ్ చరణ్ ఫాన్స్ చేసిన హడావిడి మాములుగా లేదు. మరి మన తెలుగు భాషలో ఉన్న క్రేజ్ ఒక ఎత్తు.. మిగతా భాషల్లో వారికీ ఉన్న క్రేజ్ మరో ఎత్తు అనేలా ఈ ఇద్దరి హీరోల ఫాన్స్.. ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ అనేసరికి అలెర్ట్ అవుతున్నారు. ముంబై అంటే తెలుగు వారు చాలామంది ఉంటారు. సో ఈ హీరోలకి అలా ఫాన్స్ అయ్యారు. ఇక చెన్నై అంటే తెలుగు వారు ఎక్కువే.. అక్కడ ఈ ఇద్దరి హీరోలకి అభిమానులతో ఘన స్వాగతం లభించింది. ఓ ఛానల్ రిపోర్టర్ ఈ ఫాన్స్ ని చూసి మీకేమనిపిస్తుంది అనగానే.. అంతకన్నా అదృష్టం ఏముంటుంది.. ఈ అభిమానుల ఆనందం చూస్తే అంటూ ఎన్టీఆర్ స్పందించాడు. మరి ఇదంతా చూసిన నెటిజెన్స్ ఈ క్రేజ్ ఏంది సామి అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.