Advertisement
Google Ads BL

రష్మిక కి సారీ చెప్పిన సుకుమార్


సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ప్రస్తుతం ఐదు భాషల్లో థియేటర్స్ లో సందడి చేస్తుంది. పుష్ప సినిమాకి ఓ అన్నంత గొప్ప టాక్ రాకపోయినా.. సినిమా ని ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్,  అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ ని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ గా శ్రీవల్లి పాత్రలో ఓకె ఓకె అనిపించింది. అయితే పుష్ప సినిమా నుండి రష్మిక శ్రీవల్లి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యినప్పుడు ఆ లుక్ పై చాలా ట్రోల్స్ నడిచాయి. రష్మిక లుక్ ఎవ్వరికి అంతగా ఎక్కలేదు. అయితే తాజాగా ఆ శ్రీవల్లి ఫస్ట్ లుక్ విషయం బాలయ్య అన్ స్టాపబుల్ షో లో ముచ్చటించారు.

Advertisement
CJ Advs

శ్రీవల్లిగా రష్మిక లుక్ తీసి రష్మిక కి పంపారట దర్శకుడు సుకుమార్. కానీ రష్మిక ఈ లుక్ బాగోలేదు అని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పడంతో.. సుకుమార్ ఫీలయ్యారట. మనకన్నా ఎక్కువ తెలుసా.. ఏ లుక్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందో అని అనుకున్నారట. కానీ రష్మిక లుక్ రిలీజ్ అయ్యాక.. చాలా నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. అప్పుడు రష్మిక రైట్ నేను రాంగ్ అనుకున్నాను. అప్పటినుండి రశ్మికకి సారీ చెప్పాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఈ అన్ స్టాపబుల్ స్టేజ్ పై చెబుతున్నాను అంటూ సుకుమార్ రశ్మికకి బాలయ్య సాక్షిగా సారి చెప్పారు. 

Sukumar says sorry to Rashmika:

Director Sukumar says sorry to Rashmika Mandanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs