Advertisement
Google Ads BL

మహేష్ కి ఆ కథే చెప్పా: సుకుమార్


ఇప్పుడు టాలీవుడ్ లో డీప్ గా డిస్కర్షన్ జరుగుతుంది. అదేమిటంటే.. అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా కథే.. సుక్కు మహేష్ కి చెప్పగా.. దాన్ని మహేష్ రిజెక్ట్ చేసాడు. పుష్ప సినిమా మహేష్ రిజెక్ట్ చేసి మంచి పని చేసినట్లే.. లేదంటే మహేష్ బాబు పుష్ప సినిమాతో బాగా బుక్ అయ్యేవాడు అంటూ కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా లో రిలీజ్ అయినా పుష్ప మూవీకి సో సో టాక్ వచ్చింది. మహేష్ ఆ టాక్ తప్పించుకుని మంచి పని చేసాడు అంటున్నారు మహేష్ ఫాన్స్. సుకుమార్ మహేష్ కి పుష్ప కథ చెప్పాకే.. మహేష్ రిజెక్ట్ చేసారు అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే సుకుమార్ తాజాగా ఈ విషయమై స్పందిస్తూ.. మహేష్ బాబు కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే కథను చెప్పాను. అయితే మహేష్ కి ఆ కథ నచ్చలేదు. ఆయన్ని కూల్ చెయ్యలేను, అలాగే బలవంతంగా ఒప్పించలేను. అందుకే ఆ కథని అల్లు అర్జున్ కి చెప్పాను. అయితే మహేష్ కి చెప్పిన కథ, అల్లు అర్జున్ కి చెప్పిన కథ నేపథ్యం ఒకటే.. అయినా అల్లు అర్జున్ దగ్గరకి వెళ్ళేటప్పటికి.. చాలా కథ మారింది. బ్యాక్‌డ్రాప్‌ ఒకటే అయినా కథ మాత్రం వేరు, బన్నీకి చెప్పిన కథలో అల్లు అర్జున్ క్యారెక్టర్ యాటిట్యూడ్ మారిపోయింది.. అంటూ మహేష్ పుష్ప కథ రిజెక్ట్ చేసాడనే విషయాన్ని సుకుమార్ స్పష్టత ఇచ్చారు.

Pushpa: Allu Arjun Was Chosen Over Mahesh Babu As Director:

Pushpa director Sukumar initially wanted to make the film with Mahesh Babu: Couldn’t make him cool
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs