Advertisement
Google Ads BL

నాగార్జున గారూ, మీ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు?


వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు పెద్ద సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ఎప్పుడో సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు. ఆర్ఆర్ఆర్ ని అయితే చాలా ఉదృతంగా ప్రమోట్ చేస్తున్నారు. మొత్తం ఇండియా అంతా. రాజమౌళి, చరణ్, జూనియర్ ఎన్ టి ఆర్, అలియా భట్ అందరూ చాలా బిజీ గా తిరుగుతున్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ కూడా ఇండియా అంతా రిలీజ్ అవుతోంది కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ మొదలెట్టారు. కానీ పండగకి వస్తున్నాం అని అనౌన్స్ చేసిన నాగార్జున బంగార్రాజు మాత్రం ఇంకా ఏమి మొదలెట్టలేదు.

Advertisement
CJ Advs

 నాగార్జునకి వేరే ఏమైనా ఆలోచన వచ్చిందా.. లేదా పండగకు రిలీజ్ చేస్తున్నారా. అసలు ఇంతవరకు బంగార్రాజు రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది లేదు. కనీసం ఆ సినిమా ప్రమోషన్స్ ఎందుకో మొదలెట్టలేదు. కనీసం రిలీజ్ డేట్ అయినా నొక్కి చెప్పాలి కదా. సినిమా షూటింగ్ కూడా నిన్న శుక్రవారం కంప్లీట్ చేసారు. మరి పోస్ట్ ప్రొడక్షన్ కి టైం సరిపోతుందా. ఇప్పటి నుండి సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే కదా జనాలకి ఎక్కేది. లేదా ఆర్ఆర్ఆర్ ముందు తన  సినిమా ప్రమోషన్స్ ఎవరికీ ఎక్కవు అని నాగార్జున అనుకుంటున్నారా? ఏమైనా సినిమాకి ప్రమోషన్స్ కూడా చాలా ముఖ్యం కదా. నాగార్జున తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఇంకో లీడ్ పెయిర్ గా చేస్తున్నారు బంగార్రాజు సినిమాలో.

Nagarjuna Garu, when are your film promotions?:

Why is Bangarraju team so silent for Sankranthi promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs