Advertisement
Google Ads BL

సల్మాన్ హీరో.. చరణ్, ఎన్టీఆర్ విలన్స్


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే. ప్రతి రోజు ఆర్.ఆర్.ఆర్ మూవీ కబుర్లు సోషల్ మీడియాలోనే ఉంటున్నాయి. అక్కడ, ఇక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి ప్రెస్ మీట్ అందులో ఏం చెబుతారో.. అనే క్యూరియాసిటీని బాగా కలిగించారు పాన్ ఇండియా ప్రేక్షకుల్లో. అమెరికాలో కూర్చున్న ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ అయితే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ ఎక్కడ పెడుతున్నారు. ఎక్కడ ఇంటర్వూస్ ఇస్తున్నారు, ఆర్.ఆర్.ఆర్ పై ఇంకేం చెప్పబోతున్నారంటూ మంచి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. జనవరి 7 న సినిమా రిలీజ్.. ఇంకా 10 రోజుల మాత్రమే టైం ఉంది.. ఈలోపు ఆర్.ఆర్.ఆర్ గురించి ఇంకేం చెబుతారో.. ఎన్టీఆర్ - చరణ్ లని ఎక్కడెక్కడ తిప్పుతారో అనే ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్ లో గత రాత్రి ఆర్.ఆర్.ఆర్ టీం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ 15 లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ లు గెస్ట్ లుగా వచ్చారు. అక్కడ సల్మాన్ ఖాన్ బర్త్ డే వేడుకలు, కేక్ కటింగ్ తర్వాత రాజమౌళి సల్మాన్ ఖాన్ ని హీరోగా పెట్టి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లని విలన్స్ గా పెట్టి స్టేజ్ పై సీన్స్ డైరెక్ట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కూడా రాజమౌళి స్టైల్ లో గన్ తో షూట్ చేయగా సల్మాన్ తన నోటిలో బుల్లెట్ పట్టుకుని మారణహోమాన్ని ఆపుతాడని ఊహించండి అని రాజమౌళి చెప్పారు. 

అయితే గన్ నుండి బుల్లెట్ రావడం కనిపించ లేదు అని అలియా జోక్స్ వేసింది. అది సీజీ లో చూసుకుంటాం అని రాజమౌళి కామెడీ చేసాడు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ చేసిన టాస్క్‌లో సల్మాన్ ఎలివేషన్ కు చాలానే హెల్ప్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళి యాక్షన్ చెప్పగానే సల్మాన్ ఖాన్ నటించడం షోలో హైలెట్ గా నిలిచింది.

RRR power in Bigg Boss: Salman thrills with Rajamouli, NTR, Ram Charan:

<span>Salman Khan Bigg Bosses RRR team</span> <div><span><br /></span></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs