Advertisement
Google Ads BL

బాలయ్య రామానుజ కథ ఓకె చేసారా?


నిర్మాత సి కళ్యాణ్ ఒక ఈవెంట్ లో బాలకృష్ణ తో ఓ భారీ చిత్రం నిర్మిస్తా అని చెప్పారు. అయితే దానికి ఎవరు దర్శకుడు, కథ ఏంటి అన్నది చెప్పలేదు. అయితే కళ్యాణ్ దగ్గరికి ప్రముఖ రచయిత భారవి గారు ఓ స్క్రిప్ట్ పేపరు తీసుకుని వచ్చారట. అది రామానుజ కి చెందినది. రామానుజాచార్య విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త మరియు ఆస్తిక హేతువాది. అయితే సి కళ్యాణ్ ఈ సినిమాని బాలకృష్ణ తో చెయ్యాలని అనుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇటువంటి సినిమాలు చేయగల అనుభవం వున్న సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు గారు ఈ సినిమా డైరెక్షన్ కి కరెక్ట్ అని ఈ స్క్రిప్ట్ ని అతనికి పంపారు కళ్యాణ్. అలాగే అదే స్క్రిప్ట్ ని బాలకృష్ణ కి కూడా పంపినట్టు తెలుస్తుంది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ ప్రమోషన్స్, అలాగే ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో తో బిజీగా ఉండడం వలన ఇంకా ఈ స్క్రిప్ట్ చదవలేదని.. బాలకృష్ణ టైం ఇమ్మన్నారని తెలుస్తుంది. ఒకవేళ రాఘవేంద్ర రావు గారు చేస్తాను అంటే బాలకృష్ణ ఈ చిత్రం చెయ్యడానికి వొప్పుకోవచ్చు అంటున్నారు.

Balayya to play Ramanuja?:

Balakrishna Keen On Ramanujacharya Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs