Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చిరు దేవుడు


బిగ్ బాస్ లో కి ఎన్నో ఆశలతో అడుగుపెట్టి.. అక్కడ తమలా ఉండి.. ఎంటర్టైన్మెంట్ తో క్రేజ్ తెచ్చుకుని బయటికి రాగానే మంచి సినిమా ఆఫర్స్ తో కెరీర్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు బిగ్ బాస్ కి వచ్చే కంటెస్టెంట్స్. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ లో విన్నర్ గా నిలిచిన శివ బాలాజీ.. సినిమా ఆఫర్స్ ఏమో కానీ, మా ఎలక్షన్స్ లో హడావిడీ చేసాడు. ఇక సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ హీరో హీరో అంటూ మూడేళ్ళకి ఓ సినిమా చేస్తున్నాడు. మిగతా కంటెస్టెంట్స్ విషయం సరేసరి. ఇక మూడో సీజన్ విన్నర్ అయితే సాంగ్స్ ఆల్బమ్స్ చేస్తూ సింగర్ గా ఎప్పటిలాగే బిజీగానే ఉన్నాడు. అయితే నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం వెకేషన్స్ అంటూ ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నాడు తప్ప కెరీర్ లో ఒక ఏడాదిగా చేసింది ఏం లేదు. కానీ నాలుగో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది మాత్రం కెరీర్ లో బిజీ అయ్యారు. సోహెల్, అఖిల్ హీరోలుగా మారారు. అఖిల్ అయితే యాంకర్ గా పలు ఛానల్స్ లో అదరగొట్టేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

మోనాల్ గజ్జర్ అయితే గ్లామర్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. దివి చిరు సినిమాలో చేస్తుంది. అయితే ఇప్పుడు సీజన్ 5 విన్నర్ సన్నీ సంగతి ఏమో కానీ, బిగ్ బాస్ షో నుండి వారం వారం ఎలిమినేట్ అయిన వారిలో లోబో చిరు భోళా శంకర్ మూవీలో నటించేస్తున్నాడు. అంతెకాకుండా అని మాస్టర్ ఇప్పటివరకు కొరియోగ్రాఫర్ గానే అందరికి తెలుసు. బిగ్ బాస్ క్రేజ్ తో ఆమెకి చిరు సినిమాలో నటించే స్కోప్ దొరికింది. మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మెగాస్టార్ నిజంగా దేవుడి మాదిరి కనిపిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం ఐదు సినిమాలతో సెట్స్ మీదున్నారు. సో ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కయినా చిరంజీవి సినిమాల్లో అవకాశాలు ఏ క్షణాన అయినా రావొచ్చు. ఇక మానస్, సన్నీ కాజల్ ఇలా అందరూ కెరీర్ లో బిజీ అయ్యే ప్రాసెస్ లోనే ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కి వెళ్లిన క్షణాలను యూట్యూబ్ ఛానల్స్ లోను, టివి ఛానల్స్ ఇంటర్వూస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

Bigg Boss 5 Telugu: Contestants grab movie offers:

Bigg Boss 5 contestant Lobo and Anee Master in MegaStar Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs