Advertisement
Google Ads BL

కేసీఆర్ ని ఎత్తేస్తున్న స్టార్ హీరోస్


ఏపీలో జగన్ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించేసి సినిమా ఇండస్ట్రీకి తీరని అన్యాయం చేసింది. హీరోలెవరూ నోరెత్తకుండా సైలెంట్ అయ్యిపోగా.. మెగాస్టార్ చిరు జగన్ ని, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ని కలిసి ఈ విషయం చర్చించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో థియేటర్స్ క్లోజ్ అవడంతో రిలీజ్ అయిన సినిమాల మీద పెద్ద ఎఫెక్ట్ పడింది. అటు టికెట్ రేట్స్ తగ్గించేసిన ప్రభుత్వం ఇటు థియేటర్స్ ని సీజ్ చెయ్యడం మరింత ఘోరంగా తయారైంది. ఇక ఏపీలో అలాంటి పరిస్థితులు ఉంటె.. తెలంగాణాలో టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు కల్పించింది. దానితో స్టార్ హీరోలంత టీఎస్ సీఎం కేసీఆర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరు ట్విట్టర్ లో స్పందిస్తూ..

పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి @TelanganaCMO ,మంత్రివర్యులు శ్రీ @YadavTalasani గారికి, పరిశ్రమ  బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్  కుమార్ @MPsantoshtrs గారికి  ప్రత్యేక  ధన్యవాదాలు.. అంటూ ట్వీట్చ్ హెసెరు.

విజయ్ దేవరకొండ:

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంది, నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను, తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ అంటూ స్పందించారు.

నాగార్జున అక్కినేని:

థాంక్ యు చీఫ్ మినిస్టర్ KCR గారు… మీరు తీసుకున్న నిర్ణయం వలన ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది అంటూ ట్వీట్ చేసారు. 

Star Hero's thanks Telangana CM KCR:

Chiranjeevi and Nagarjuna thanks Telangana CM KCR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs