ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక్క పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకోవడానికి మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఏవేవో చేస్తోంది. ఇప్పటికే చాలా సినిమా హాల్స్ ఆంధ్రలో మూసేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇన్ని చేసినా ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి మంచే జరుగుతోంది, పవన్ వేల్యూ ఇంకా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా సంవత్సరానికి ఒకటో రెండో రిలీజ్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు జనాలు సినిమా హాల్ కి రావటమే కష్టం అన్న సమయం లో ఇటువంటి ఆంక్షలు పెట్టడం ఎవరికీ ఉపయోగం లేదు.
పైగా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అస్సలు తన సినిమాని సినిమా హాల్స్ లో రిలీజ్ చెయ్యటం కంటే ఓటిటి లో రిలీజ్ చేస్తే ఏమి చేస్తారు. ఒక ప్రైవేట్ ఓటిటి ఇప్పటికే చాలా పెద్ద బంపర్ ఆఫర్ పవన్ కళ్యాణ్ సినిమా కి ఇచ్చినట్టు బోగట్టా. ఈ ఆఫర్ ఎలాంటిది అంటే నిర్మాతలకి అతి సులువుగా టేబుల్ ప్రాఫిట్ వచ్చేటంత అని తెలిసింది. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఒక సభలో తన సినిమా అవసరం అయితే ఫ్రీ గా ప్రజలకి చూపిస్తా అని కూడా అన్నారు. ఫ్రీగా అంటే ఇదే, డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చెయ్యటం. మీరు పవన్ కళ్యాణ్ ని ఎదో చెయ్యటం కాదు, పవన్ కల్యాణే స్వీట్ గా రివెంజ్ తీర్చుకోవచ్చు.
అలాగే ఒక్క ఆంధ్ర లో తప్పితే, మిగతా చోట్ల ఒక వారం తన సినిమా ని రిలీజ్ చేసి, వారం తరువాత ఓటిటి లో రిలీజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ వుంది పవన్ కళ్యానికి. ఈ పండెమిక్ టైం లో పవన్ కళ్యాణ్ కే ఎటు చూసినా లాభం వుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎలా చెయ్యాలా, ఏమి చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తున్నట్టు భోగట్టా.