Advertisement
Google Ads BL

రాజమౌళి సామాన్యుడు కాదు


రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ని వెంటేసుకుని రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేసే పలు భాషల్లో ప్రమోషన్స్ తో ఆసక్తిని రేపుతున్నారు. ఆఖరికి క్రీడల ఓపెనింగ్స్ లోను ఈ హీరోలే కనిపిస్తున్నారు. హీరోలని కాదు. 15 నిమిషాల నిడివి పాత్ర చేసిన అలియా భట్ కూడా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో పాల్గొంటుంది. కేవలం రెండు వారాల టైం ఉన్న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కి. ఈలోపులో రాజమౌళి మరింతగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ప్రో కబడ్డీ లీగ్ లో ఆర్.ఆర్.ఆర్ ని ప్రమోట్ చేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా తో బాలీవుడ్ టాక్ షో కపిల్ శర్మ షో లో సినిమాని ప్రమోట్ చేసారు. అలాగే ఐదు భషాల్లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ముంబైలో బాలీవుడ్ హీరో సల్మాన్ గెస్ట్ గ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Advertisement
CJ Advs

ఇక చెన్నై లోను ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కి తమిళ టాప్ హీరోని గెస్ట్ గా పిలవబోతున్నారట. అయితే అజిత్ ని పిలుస్తారా? లేదంటే సూపర్ స్టార్ రజనీనా? లేదంటే విజయ్ నా? అనేది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ గా ఉన్న ప్రశ్న. ఇక కన్నడలోనూ, మలయాళంలోనూ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసి.. అక్కడ టాప్ హీరోలని ఆహ్వానిస్తున్నారట. తెలుగులో చెయ్యబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ, మెగాస్టార్ గెస్ట్ లుగా రాబోతున్నారనే టాక్ ఉంది. బాలీవుడ్ బిగ్ బాస్ కి కూడా రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. మరి ఇవన్నీ అయ్యేలోపు ఆర్.ఆర్.ఆర్ హీరోలతో కలిసి రాజమౌళి వీలైనన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.

Rajamouli is no ordinary man:

<span>NTR, Ram Charan enters Salman Khan Bigg Boss</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs