Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ లో ట్విస్ట్ లు, క్లైమాక్స్ అదిరిపోతాయ్


హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలు, రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ వేడుకలు ఆకాశమే హద్దుగా, అభిమానులే అతిధులుగా జరిగింది. డిసెంబర్ 23 న అభిమానులే అతిధులుగా రాధేశ్యామ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నేషనల్ వైడ్ గా చెప్పుకునేలా మేకర్స్ ప్లాన్ చేసారు. ఆ ఈవెంట్ లో కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్ గా అదరగొట్టేయ్యగా.. పూజ హెగ్డే పట్టు చీరలో తళుక్కుమంది. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మట్లాడుతూ.

Advertisement
CJ Advs

ఐదేళ్లు నిర్విరామంగా ఒక సినిమా కోసం పని చెయ్యడం, అనేక పరిస్థితులను దాటుకుని ఇక్కడి రావడంలో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ కే ఆ క్రెడిట్ అంతా దక్కుతుంది. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమని ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ ని ఆకాశానికెత్తేశారు.. గోపీకృష్ణ బ్యానర్‌పై మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు రాధేశ్యామ్‌ తెరకెక్కినది. ఇది లవ్‌స్టోరీయే కానీ... సినిమా అంతకుమించి ఉంటుంది అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు ప్రభాస్. కొవిడ్‌ సమయంలో చిత్ర బృందం చాలా కష్టపడింది. రెండేళ్లు జార్జియ, ఇటలీ తదితర దేశాల్లో రాధేశ్యామ్ షూటింగ్ జరిపారు. అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ చాలా అందంగా రాధేశ్యామ్‌ ను తీర్చిదిద్దారు. 

రాధేశ్యామ్ సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. క్లైమాక్స్‌ అందరినీ మెప్పిస్తుంది. అభిమానుల వల్లే ఈ కార్యక్రమం ఇంతా బాగా జరిగింది అని అన్నారు.

Prabhas speech at Radhe Shyam Pre release event :

Prabhas Radhe Shyam Pre release event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs