Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే


ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో తెరకెక్కిన రాధేశ్యామ్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. జనవరి 14 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా, ట్రైలర్ లాంచ్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరుపుతున్నారు. అభిమానులే అతిధులుగా.. జరుగుతున్నా ఈ ప్రోగ్రాం కి ప్రభాస్ తో పని చేస్తున్న డైరెక్టర్స్ అంతా హాజరయ్యారు. ఆదిపురుష్ ఓం రౌత్ నుండి నాగ్ అశ్విన్, స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగ వచ్చారు. ప్రభాస్, పట్టు చీరలో పూజ హెగ్డే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకలో అభిమానుల చేతుల మీదుగా రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. 

Advertisement
CJ Advs

70ల కాలం నాటి ప్రేమకథతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీలో ప్రపంచమే మెచ్చే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. పూజ హెగ్డే ప్రేరణగా ప్రభాస్ ప్రేమికురాలిగా కనబడుతుంది. ప్రభాస్ - పూజ హెగ్డే లవ్ స్టోరీ చుట్టూనే రాధేశ్యామ్ ట్రైలర్ కటింగ్ ఉంది. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవని అమ్మ అడిగితె చెప్పు అంటూ ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ లో పూజ హెగ్డే గెంతుతూ విజిల్ వేస్తూ కనిపించింది. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అని పూజ హెగ్డే క్యూట్ గా చెప్పిన డైలాగ్ కి ప్రభాస్ కన్ను గీటుతూ అదరగొట్టేసాడు. ట్రైలర్ మొత్తంలో ప్రభాస్ - పూజ హెగ్డే హైలెట్ గా నిలిచారు. రొమాంటిక్ గాను, అందంగానూ కనిపించారు. నాతో ప్రేమలో పడితే ఛస్తావ్ అంటూ పూజ ప్రభాస్ తో చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.  

నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరో మెయిన్ హైలెట్ అనేలా ఉంది. ఇక విజువల్ వండర్ గా కనిపించబోతున్న రాధేశ్యామ్ పై ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. ఇండియా వైడ్ ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. మరి రాధేశ్యామ్ ట్రైలర్ ఆ అంచనాలకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టే కనిపిస్తుంది.  

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాధేశ్యామ్ ట్రైలర్

Radhe Shyam Trailer Talk :

Prabhas Radhe Shyam Trailer review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs