మొన్న రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రిని, ఏపీ మంత్రులపై టికెట్ రేట్స్ విషయంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా.. ఏపీ మంత్రులంతా పవన్ పై దండెత్తారు. పొలిటికల గా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. అప్పట్లో పవన్ కి ఇండస్ట్రీ సపోర్ట్ లేదు.. కేవలం నాని, కార్తికేయ లాంటి యంగ్ హీరోస్ తప్ప. తాజాగా హీరో నాని కూడా ఏపీ ప్రభుత్వం ఫిక్స్ చేసిన టికెట్ రేట్స్ ఇష్యుపై సంచలనంగా మాట్లాడాడు. థియేటర్స్ కన్నా కిరాణా కొట్టు మేలు.. సంపాదన ఎక్కువ ఉంటుంది అంటూ మాట్లాడాడు. దానితో ఏపీ మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కొడాలి నాని, కన్నబాబు అలాంటి వాళ్ళు హీరో నానిపై పడిపోయారు.
హీరో నాని సినిమా టికెట్ రేట్స్ ఇష్యుపై మాట్లాడడం సరికాదు అంటూ నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 500 టికెట్ ధర పెడితే ఇండస్ట్రీ సమస్య తీరిపోతుందా అంటూ నానికి ప్రశ్నలు వేస్తున్నారు.
ఇక కొడాలి నాని అయితే.. ఇండస్ట్రీ వలన ఏపీ కి ఎలాంటి ఉపయోగం లేదు. ఏపీలో కనీసం షూటింగ్స్ కూడా చెయ్యడం లేదు. హైదరాబాద్ లోనే షూటింగ్స్ చేసుకుంటున్నారు. అలాగే సామాన్యుడి నెత్తి మీద టికెట్ రేట్స్ రుద్దితే కుదరదు.. అందుకే ప్రభుత్వం ఇష్టానుసారం పెంచే టికెట్ రేట్స్ ని కట్టడి చేస్తుంది అంటూ నాని పై విరుచుకుపడ్డాడు. ఇంకా మరో మంత్రి కన్న బాబు నానికి కిరాణా షాపులంటే అంత చులకనా.. అంటూ ఎద్దేవా చేసారు.