Advertisement
Google Ads BL

నాగార్జున ఘోస్ట్ పై అనుమానాలు


నాగార్జున ఈ ఏడాది వైల్డ్ డాగ్ సినిమా హిట్ తో మాంచి జోష్ మీద రెండు సినిమాలను మొదలు పెట్టారు. అందులో ప్రవీణ్ సత్తారు తో ఎప్పుడో ఘోస్ట్ మూవీని మొదలు పెట్టిన నాగార్జున రీసెంట్ గానే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ మొదలు పెట్టారు. నాగార్జున - ప్రవీణ్ సత్తారు ఒకటి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాకా ఆ మూవీని పక్కనపడేసారు. అందుకు కారణం ఒకటి ఆ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకోవడం, రెండోది.. టెక్నీకల్ ఇష్యుస్ అంటూ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం. ఇక కాజల్ తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి హీరోయిన్ ని తెచ్చేందుకు ప్రవీణ్ సత్తారు నానా తంటాలు పడుతున్నారు. కాజల్ వెళ్ళాక ఆ ప్లేసులోకి అమల పాల్ వస్తుంది అని, ఆమె రెన్యుమరేషన్ ఎక్కువ అడిగింది.. ఆమె కాదు.. అంటూ చాలా పేర్లు వినిపించినా ఫైనల్ గా సోనాల్ చౌహన్ పేరు లైన్ లోకొచ్చింది.

Advertisement
CJ Advs

అదలా ఉంటే ఘోస్ట్ కన్నా లేట్ గా మొదలైన బంగార్రాజు షూటింగ్ మాత్రం నాగార్జున పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతవరకు సంక్రాంతి బరిలో బంగార్రాజు రిలీజ్ అంటూ ప్రచారం జరగడమే కాదు, బంగార్రాజు ప్రమోషన్స్ కూడా సంక్రాంతి టార్గెట్ గానే మొదలైపోయాయి. నాగ చైతన్య - నాగార్జున కలయికలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే లుక్స్, సాంగ్స్ అంటూ బంగార్రాజు పై మేకర్స్ మరింతగా అంచనాలు పెంచుతున్నారు. బంగార్రాజు ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా సంక్రాంతి టార్గెట్ గానే జరుగుతున్నాయి.. ఇక రేపో మాపో బంగార్రాజు సినిమా సంక్రాంతి కే అనే ఎనౌన్సమెంట్ కూడా రావొచ్చు. ముందు బంగార్రాజుని ఫినిష్ చేసేస్తే.. తర్వాత ఘోస్ట్ పని చూడొచ్చని నాగ్ అనుకుంటున్నట్లుగా ఉన్నాడు.. అందుకే ఘోస్ట్ ని వెనక్కి నెట్టి బంగార్రాజుని ముందుకు తీసుకొచ్చేస్తున్నారు.

Suspicions on Nagarjuna Ghost:

Sonal Chauhan opposite Nagarjuna Ghost
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs