Advertisement
Google Ads BL

ధనుష్ - వెంకీ అట్లూరి 'సార్‌'


తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి.. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ తో సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు వాతి, తెలుగు వెర్ష‌న్‌కు సార్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఉత్తేజ‌భ‌రిత‌మైన‌ టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను  నిర్మాత‌లు ఆవిష్కరించారు. 

Advertisement
CJ Advs

టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్ అని చెప్పారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌కారం ధ‌నుష్ ఒక జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ క‌నిపిస్తోంది. అంటే ఇది ఒక పీరియాడిక‌ల్ మూవీ అనీ, హీరో త‌న క‌లం బ‌లంతో స్టూడెంట్స్‌కు ఒక రోల్ మోడ‌ల్ అవుతాడ‌నీ ఊహించ‌వ‌చ్చు. మొత్తంగా ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటే, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన, ఉత్తేజ‌క‌ర‌మైన‌ క‌థ‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న ముందు ప్రెజెంట్ చేయ‌నున్నార‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది. చిత్రం పేరుతో కూడిన ప్రచార చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. 

కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక‌య్యారు. సూదు కవ్వం, సేతుపతి, తెగిడి, మిస్టర్ లోకల్, మార వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ ద్విభాషా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ 2022 జ‌న‌వ‌రిలో మొద‌లవుతుంది.

Dhanush - Venky Atluri Bilingual Movie titled as SIR:

Dhanush - Venky Atluri - Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as SIR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs