బిగ్ బాస్ హౌస్ లోకి విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తో టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టి.. చివరికి రన్నర్ గా మిగిలిన షణ్ముఖ్.. హౌస్ లోకి వెళ్ళాక చాలా రోజులు ఒంటరిగా ఉన్నాడు. తర్వాత సిరి, జెస్సి ల ఫ్రెండ్ షిప్ తో బ్రహ్మ గా మారాడు. టాస్క్ ల పరంగా వీక్ గా ఉన్న షణ్ముఖ్ తర్వాత టాస్క్ ల పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. అలాగే ఎన్నిసార్లు నామినేషన్స్ లో ఉన్నా.. షణ్ముఖ్ ఓటింగ్ పరంగా ముందుండేవాడు. కానీ సిరి ఫ్రెండ్ షిప్ అతన్ని చెడగోట్టింది. బిగ్ బాస్ హౌస్ లో ముద్దులు, హగ్గులు అంటూ సిరి, షణ్ముఖ్ లు చేసిన రచ్చ తో షణ్ముఖ్ మీదున్న సాఫ్ట్ కార్నర్, ఇంప్రెషన్ అంతా పోయింది.
అయితే రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ ని ఈ విషయమే అడిగితే.. నేను రన్నర్ గా నిలుస్తాను అని ముందే తెలుసు.. అంటే మీరు సిరి తో చేసిన ఫ్రెండ్ షిప్ వలనే మీకు నెగిటివిటి వచ్చింది బయట.. అలా అని మీరుకూడా అనుకుంటున్నారా అని అడిగితే.. అవును నేను హౌస్ లో చేసిన చిన్న, చిన్న తప్పిదాల వలనే రన్నర్ గా మిగలాల్సి వచ్చింది అంటూ అతను చేసిన మిస్టేక్ షణ్ముఖ్ ఒప్పుకున్నాడు. నిజమే కాస్త కోపం, అగ్రెసివ్ నెస్ ఉన్న సన్నీ యాక్టీవ్ గాఎంటర్టైన్మెంట్ పరంగా కాస్త మెరుగ్గా ఉండడంతో అతను విన్నర్ అయ్యాడు. డల్ గా, సిరి తో చేసిన ఫ్రెండ్ షిప్, హగ్గులు, కిస్ ల వలనే విపరీతమైన పాపులారిటీ ఉన్న షణ్ముఖ్ రన్నర్ గా మిగలాల్సి వచ్చింది.