పాన్ ఇండియా మూవీ గా ఐదు భాషల్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. పుష్ప రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య పుష్ప సక్సెస్ పార్టీ ఈ రోజు మంగళవారం జరుగుతుంది. ఈ మాసివ్ సక్సెస్ మీట్ లో పుష్ప టీం మొత్తం పాల్గొంది. అనసూయ తో పాటుగా మంగళం శీను గ నటించిన సునీల్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనండి. అయితే సునీల్ మాట్లాడుతూ.. అందాల రాముడు సినిమాలో హీరోగా నటించినపుడు నా జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది..
ఇప్పుడు మళ్లీ విలన్ గా కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ. తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా అదే వైబ్రేషన్ రావడం పుష్ప సినిమాకు ఉన్న స్పెషల్. ఒక భాషలో కాదు ఈ సినిమాతో అన్ని భాషల్లో విలన్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుక్కు డార్లింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఒకేసారి గుర్తు తెచ్చుకో అంటూ బన్నీ గారు నన్ను విసిరి కొట్టేసారు. నన్ను మంగళం శీను గా సీరియస్ పాత్రలో కూడా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పుష్ప సినిమా ఇంకా అద్భుతమైన విజయం సాధిస్తుంది అంతో మాట్లాడాడు సునీల్.