Advertisement
Google Ads BL

నానికి ఆ దురద పోలేదట.!


చిన్న సినిమా నుండి ఒక పెద్ద రేంజ్ కి ఎదిగిన నటుడు నాని. ఇండస్ట్రీ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టాడు, దర్శకుడిగా స్థిరపడాలని అనుకున్నాడు. కానీ దర్శకుడు ఇంద్రగంటి నాని ని నటుడుని చేసాడు. అప్పటి నుండి అదే కొనసాగిస్తూ, ఈరోజు కొంచెం పెద్ద రేంజ్ కి ఎదిగాడు. అతని సినిమా శ్యామ్ సింఘా రాయ్ ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. మొదటి సారిగా అతని సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. కానీ టాక్ ఏంటంటే, నాని తన దర్శకత్వం దురద మాత్రం పోలేదుట. అందుకనే ప్రతీ సినిమాలోనూ వేలు పెడతాడు అని తెలిసింది. 

Advertisement
CJ Advs

ఒక్కోసారి మిగతా రోల్స్ కి కూడా ఎవరిని తీసుకోవాలో నాని నిర్ణయిస్తాడట. ఇప్పుడు శ్యామ్ సింఘా రాయ్ లో కూడా కొన్ని సీన్స్ నాని నే డైరెక్ట్ చేసాడని ఇండస్ట్రీ లో టాక్ వుంది. ఎందుకంటే అతను ఒక రేంజ్ కి వచ్చాక, దర్శకుడితో పాటు అన్ని సీన్స్ చర్చించి, ఆ తరువాతనే షూట్ మొదలు పెడతారట. అంటే నాని వున్నా సీన్స్ ఒక్కటే కాదండీ, ఇతర నటులు వున్నసీన్స్ కూడా నాని దర్శకుడితో డిస్కస్ చేస్తాడట. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయం లో వేరే ఆర్టిస్ట్ బాగా చేసాడు అని తెలిస్తే చాలు, ఆ సీన్ ఎడిటింగ్ లో లేపడానికి ట్రై చేస్తాడట. ఇలా నాని పై గుసగుసలు విన్పిస్తున్నాయి. శ్యామ్ సింఘా రాయ్ హిట్ ఐతే నానినే కర్రెక్ట్ అని అంటారేమో.! 

Did the Itching still not go away.!:

 Did the Itching still not go away for Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs