మహేష్ బాబు సర్కారు వారి పాటని ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడే జనవరి 2022 సంక్రాంతి కి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ జనవరి 7 న రిలీజ్ అనగానే.. మహేష్ బాబు కూల్ గా సమ్మర్ కి అంటే ఏప్రిల్ కి సర్కారు వారి పాట రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసేసాడు. ఇక మిగిలిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను భీమ్లా నాయక్ జనవరి 12 సంక్రాంతికే అని పట్టుపట్టుకుని కూర్చున్నారు. అటు ఆర్.ఆర్.ఆర్ ఇటు రాధేశ్యామ్ మధ్యలో భీమ్లా నాయక్ రిలీజ్ అన్నారు. ఇక మధ్యలో రాజమౌళి భీమ్లా నాయక్ మేకర్స్ తో మంతనాలు జరపడమే కాదు. పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కూడా పెట్టారని వార్తలొచ్చాయి.. అయినా భీమ్లా నాయక్ మేకర్స్ తగ్గలేదు.
తాజాగా భీమ్లా నాయక్ మేకర్స్ తమ సినిమాని సంక్రాంతి నుండి తప్పించి.. ఫిబ్రవరి 25 కి రిలీజ్ డేట్ మార్చుకుని ఆర్.ఆర్.ఆర్ మేకర్స్, రాధేశ్యామ్ మేకర్స్ నెత్తిన పాలు పోశారు. లేదంటే భీమ్లా నాయక్ దెబ్బకి అటు ఆర్.ఆర్.ఆర్ ఇటు రాధేశ్యామ్ కలెక్షన్స్ కి భారీ కోత పడేది.. ఇప్పుడు ఆ ప్రాబ్లెమ్ లేదు.. అందుకే భీమ్లా నాయక్ రిలీజ్ పోస్ట్ పోన్ అనగానే రాజమౌళి భీమ్లా నాయక్ మేకర్స్ కి మాత్రమే కాదు.. పవన్ కి, మహేష్ బాబు సర్కారు వారి పాట మేకర్స్ కి మహేష్ బాబు కి థాంక్స్ చెప్పేసారు. అటు రాధేశ్యామ్ శ్యామ్ మేకర్స్ కూడా పవన్ భీమ్లా నాయక్ మేకర్స్ కి థాంక్స్ చెప్పేసారు.