Advertisement
Google Ads BL

అఫీషియల్: అనుకున్నదే.. భీమ్లా నాయక్ పోస్ట్ పోన్


సంక్రాంతి బరి నుండి భీమ్లా నాయక్ తప్పుకుంటుంది, తప్పుకుంటుంది, డేట్ మార్చుకుంటున్నది.. ఇలా గత రెండు నెలలుగా జరిగిన ప్రచారం నిజమైంది.. అనుకున్నదే అయ్యింది.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సంక్రాంతి రేస్ నుండి అఫీషియల్ గా తప్పుకుంది. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ లాంటి బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వలనే భీమ్లా నాయక్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటున్నట్లుగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అంటే దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ - వెంకటేష్ కలయికలో ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 ఆసలైతే.. ఫిబ్రవరి 25 మహా శివ రాత్రి కి రిలీజ్ అంటూ ఎప్పుడో డేట్ ప్రకటించారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే డేట్ ని దిల్ రాజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కోసం త్యాగం చేసినట్లుగా ఈ రోజు డిసెంబర్ 21న ఉదయమే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ అలాగే రాధేశ్యామ్ భారీ బడ్జెట్ మూవీస్, అంతేకాకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. చాలా ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్స్ అవి.. సో నిర్మాతలకు దెబ్బ పడకుండా.. ఆ రెండు సినిమాలకు స్పేస్ ఇస్తూ.. భీమ్లా నాయక్ ని సంక్రాతి రేస్ నుండి తప్పించి.. ఫిబ్రవరి 25 కి డేట్ కి షిఫ్ట్ చేస్తున్నారు.. F3 డేట్ లో భీమ్లా నాయక్ మహాశివరాత్రికి రిలీజ్ కాబోతుంది. సో దాని కోసం మా ఎఫ్ 3 మూవీ సమ్మర్ కి షిఫ్ట్ చేస్తున్నాం.. ఏప్రిల్ 29 న నవ్వుల పండుగ ఇప్పుడు వేసవి లో అంటూ దిల్ రాజు గారు సెలివిచ్చారు.

Official: Bheemla Nayak postponed:

Bheemla Nayak postponed, New release date out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs