Advertisement
Google Ads BL

అసలు పరీక్ష మొదలయ్యింది పుష్పా..


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ గత శుక్రవారమే పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప కి ఓపెనింగ్ డే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. కారణం కరోనా తరవాత  పెద్ద సినిమాని, అందులోనూ పాన్ ఇండియా మూవీ అనగానే అందరిలో కలిగిన ఆసక్తి.. పుష్ప ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోవడానికి కారణం. మొదటి మూడు రోజులు వీకెండ్ కావడంతో పుష్ప.. కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.. ముందే మూడు రోజుల బుకింగ్స్ తో బాక్సాఫీసు కళకళ లాడింది. అయితే అసలు పరిక్ష పుష్ప కి నిన్న అంటే సోమవారం మొదలైనట్లే కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

శుక్ర, శని, ఆదివారాల్లో పుష్ప థియేటర్స్ కళకళలాడాయి. ముందస్తు  బుకింగ్స్ తో టాక్ కి సంబంధం లేకుండా.. పుష్ప కలెక్షన్స్ రాబట్టింది.. సోమవారం వచ్చేసరికి పుష్ప అసలు పరిక్షకి రెడీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం, మధ్యాహ్నం షోలతోనే కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లుగా.. ఆయా థియేటర్స్ ఆక్యుపెన్సీ చూస్తే తెలుస్తుంది. వీక్ ప్రమోషన్స్ తో బరిలోకి దిగి.. మిక్స్డ్ టాక్ రాగానే.. ప్రమోషన్స్ తో క్రేజ్ పెంచాల్సింది.. కానీ పుష్ప టీం సినిమా రిలీజ్ అయ్యాక ఐదు రోజులకి అంటే ఈ రోజు మంగళవారం తిరుపతి పుష్ప మాసివ్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంది.. తప్ప సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తగ్గించేసరికి.. ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది అంటున్నారు. అసలే వీక్ డేస్.. ఇంకా పుష్ప బ్రేక్ ఈవెన్ కి దగ్గరవ్వాలంటే.. గట్టిగా వసూలు చెయ్యాలి.. మరి సోమవారం తెలుగు రాష్ట్రాల్లోనే పుష్ప వసూళ్లు పడిపోయాయి అంటే.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భాషల్లో పుష్ప కలెక్షన్స్ మరింతగా తగ్గే అవకాశం లేకపోలేదు.

Pushpa monday box office performance:

Box Office: Pushpa has an excellent opening weekend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs