Advertisement
Google Ads BL

ఆచార్య గురించి మాట్లాడండి చిరంజీవి గారూ


మెగా స్టార్ చిరంజీవి గారు నాలుగు సినిమా షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న న్యూస్ ఇంకా వైరల్ కాకముందే, అదే చిరంజీవి గారు ఇంకో సినిమా ఇంకో కుర్ర దర్శకుడు వెంకీ కుడుములతో చేస్తున్నారు అన్న వార్త వచ్చింది. ఇవే కాకుండా ఇంకా కొన్ని లైన్ లో ఉన్నాయని కూడా టాక్. అయితే ఇండస్ట్రీ లో ఇప్పుడున్న టాక్ ఏంటంటే, చిరంజీవి గారిని ముందు ఆచార్య సినిమా గురించి మాట్లాడమనండి, ఆ తరువాత ఎన్ని సినిమాలు అయినా ఒప్పుకోమనండి అంటున్నారు. ఆచార్య సినిమా ప్రారంభించి రెండేళ్లు పైబడింది. అయినా ఇంకా ఎప్పుడు వస్తుందా అని చిరు అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాలుగు ఆచార్య రిలీజ్ అని అనౌన్స్ చేసారు, కానీ ఆ సినిమా గురించి చిరు ఎక్కడా ఏమి మాట్లాడటం లేదు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే, ఇలా వరుసగా సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ వెళితే ఏముంటుంది, ముందు ఆ ఆచార్య సినిమా రిలీజ్ చేసి, ప్రస్తుతం వున్న పాండెమిక్ టైం లో జనాలను సినిమా హాల్స్ కి తీసుకు రావాల్సిన బాధ్యత కూడా వుంది కదా అంటున్నారు. ఆచార్య సినిమా నుంచి రెండు పాటలు, రెండు టీజర్ లు ఇప్పటి వరకు రిలీజ్ చేసారు అంతే. నిన్న మొన్నటి వరకు షూటింగ్ కూడా చేస్తూనే వున్నారు. బాస్ ను తెరపై ఎప్పుడు చూస్తామా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఒక సినిమా ఇంకా పూర్తి అవకుండానే చిరంజీవి గారు ఐదో సినిమా కూడా ఒప్పుకున్నారు అన్నది మరీ కొంచెం అతిగా లేదూ.! ఇది ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్న టాక్ సుమండీ!

Talk about Acharya first, Chiranjeevi:

Chiranjeevi Acharya release on February 4th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs