Advertisement
Google Ads BL

నిర్మాతే బాయ్ కాట్ చెయ్యండి అంటున్నారు


నిర్మాతే బాయ్ కాట్ చెయ్యండి అంటున్నారు.. ఈ మాట వినడానికే విచిత్రం గా వుంది కదూ. అవును సాక్షాతూ సదరు నిర్మాతే మీడియా వాళ్ళకి బాయ్ కాట్ చెయ్యమని చెప్తున్నాడు. అసలు విషయం లోకి వస్తే.. నాని నటించిన శ్యాం సింఘా రాయ్ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఇంటర్వ్యూ సోమవారం ఉదయం శ్యాం సింఘా రాయ్ సినిమా ఆఫీస్ లో పెట్టారు. ఇంటర్వ్యూ అయ్యాక మీడియా మిత్రులు బయటకి వచ్చి దర్శకుడు లేట్ గా వచ్చారు అని ఎదో డిస్కషన్ చేసుకుంటున్నారు. పక్కనే వున్న నిర్మాత ఆ లేట్ అన్న పదం విని, ఏంటి దర్శకుడు లేట్ గా వచ్చారా అని అడిగారు. 

Advertisement
CJ Advs

మీడియా మిత్రులు లేదండి అని ఎదో చెప్పబోతుంటే నిర్మాత బోయనపల్లి వెంకట్.. ఎవరు లేట్ గా వచ్చిన మీ మీడియా వాళ్ళు బాయ్ కాట్ చెయ్యండి. టైం విలువ తెలియక పోతే ఎలా, ఎవరు టైం కి రాకపోయినా కూడా మీరు బాయ్ కాట్ చెయ్యండి అని సలహా ఇచ్చారు. ఇలా ఒక నిర్మాతే మీడియా వాళ్ళని తన సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అయినా లేట్ గా వస్తే  బాయ్ కాట్ చెయ్యమని చెప్పడం, ఆ నిర్మాతకి టైం పట్ల ఎంత నిబద్ధతో అర్థం చేసుకోవచ్చు. నాని నటించిన శ్యామ్ సింఘా రాయ్ వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కి బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యింది అని ఒక ప్రచారం.

The producer only says Boycott:

Boycott your media who came in late says Shyam Singha Roy Producer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs