సీరియల్ ఆర్టిస్ట్ గా, యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సిరి హన్మంత్.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఏకంగా 15 వారాలు పాటు అబ్బాయిలతో నెగ్గుకొచ్చింది. షణ్ముఖ్ జాస్వంత్ తో హగ్గులు, కిస్సులు అంటూ సిరి కాస్త ఓవర్ చేసింది. గేమ్ పరంగా, టాస్క్ ల పరంగా అబ్బాయిలకి గట్టి పోటీ ఇచ్చిన సిరి.. సన్నీ తో ఎప్పుడూ గొడవపడేది. అంటే షణ్ణుకి హగ్స్, సన్నీతో ఫైర్ అన్నట్టుగా ఉండేది. ఇక బిగ్ బాస్ లో షణ్ముఖ్ లేకుంటే సిరి ఇంకాస్త మెరుగ్గా ఆడుండేది అనే అభిప్రాయం ఆమె ఫాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక 19 కంటెస్టెంట్స్ లో టాప్ 5 కి వెళ్లిన లేడీ కంటెస్టెంట్స్ గా సిరి నిలిచింది.
అయితే బిగ్ బాస్ లోకి వెళ్లేముందు తన క్రేజ్ ని బట్టి సిరి బిగ్ బాస్ యాజమాన్యంతో వారానికి లక్షన్నర నుండి - రెండు లక్షల వరకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే 15 వారాలకు గాను.. సిరి దాదాపుగా 25 లక్షలు బిగ్ బాస్ నుండి అందుకుంది.. మరి బిగ్ బాస్ ద్వారా ఈ లెక్కన సిరికి గట్టిగానె ముట్టింది.. మూడు నెలలకి తన కష్టము ఫలితం 25 లక్షలు సంపాదించింది సిరి. గ్లామర్ పరంగాను, షణ్ముఖ్ తో ఓవర్ ఫ్రెండ్ షిప్ పరంగాను సిరి అతి చేసినా.. బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ మాత్రం ఇచ్చింది అనే చెప్పాలి.