Advertisement
Google Ads BL

బంగార్రాజు వాసివాడి తస్సాదియ్యా సాంగ్


కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

Advertisement
CJ Advs

అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేస్తుండగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బంగార్రాజుకు పెళ్లయిపోతుందనే బాధను ఫరియా అబ్దుల్లా ఈ పాటలో వివరిస్తారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల రచించారు. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి కలిసి ఆలపించారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లో కనిపిస్తున్నారు.

ఈ పాట కచ్చితంగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారుతుంది. ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.  

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో  నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.

Party Song Of The Year Vaasivaadi Tassadiyya From Bangarraju Out:

<span>Party Song Of The Year Vaasivaadi Tassadiyya From&nbsp;Nagarjuna Bangarraju&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs