Advertisement
Google Ads BL

ఈటివి నుండి పిల్లలు కూడా జంపా


ఈమధ్యన స్టార్ మా లో బిగ్ బాస్ లో పాల్గొన్న సీజన్ కంటెస్టెంట్స్ చాలామంది ఈ టివి స్పెషల్ ప్రోగ్రాం కి, క్యాష్ ప్రోగ్రాం లోను హడావిడి చేస్తున్నారు. గతంలో ఓ ఛానల్ లో ఉన్న వాళ్ళు మరో ఛానల్ లో ఎక్కువగా కనిపించేవారు కాదు.. ఇప్పుడు అలా కాదు, ఈటివి వాళ్లకు, స్టార్ మా కి, స్టార్ మా వాళ్ళు ఈటివి ప్రోగ్రామ్స్ లో సందడి చేసేస్తున్నారు. స్టార్ మా సీరియల్ ఆర్టిస్ట్ లు కూడా ఈటీవీ ప్రోగ్రాంలో కనిపిస్తున్నారు. కేవలం ఈటివి, స్టార్ మా నే కాదు, జీ తెలుగులోనూ అటు ఇటు చేంజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఢీ డాన్సర్స్, డాన్స్ మాస్టర్స్, ఆఖరికి ఢీ జేడ్జ్ పూర్ణ కూడా స్టార్ మా మ్యూజిక్ లో కనిపిస్తే.. స్టార్ మా వాళ్ళు ఈటివి శ్రీదేవి సోడా కంపెనీ, అలాగే జీ తెలుగులో క్వీన్ ప్రొగ్రాంలోను కనబడుతున్నారు.

Advertisement
CJ Advs

జబర్దస్త్ వాళ్ళు స్టార్ మా కామెడీ స్టార్స్ లోకి వచ్చేస్తున్నారు. నాగబాబు అంటే జబర్దస్త్ కి వెళ్లలేక స్టార్ కామెడీ షో కి జేడ్జ్ గా వస్తున్నాడు. ఇక జబర్దస్త్ రాకెట్ రాకేష్ స్కిట్ లో చేసిన చిన్న పిల్లలు యోదా, నిహంత్, దీవెన స్టార్ మా లోని కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చేసేస్తున్నారు. స్పెషల్ గా వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే జబర్దస్త్ కి కామెడీ స్టార్స్ కి తేడా తెలియనంతగా అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ అన్నట్టుగా మారిపోతున్నారు. మరి జబర్దస్త్ కి 10 లక్షలు ఫైన్ కట్టి బిగ్ బాస్ కి వచ్చాను అని ముక్కు అవినాష్ చెప్పాడు. మరి బిగ్ బాస్ లోనూ ఓ ఏడాది అగ్రిమెంట్స్ ఉంటాయి.. ఆతర్వాతే వాళ్ళు ఏ ఛానల్ కైనా వెళ్లొచ్చు. మరి బిగ్ బాస్ 4 పూర్తయ్యి ఏడాది అవడంతో సీజన్ 4 కంటెస్టెంట్స్ లాస్య లాంటి వాళ్ళు పక్క ఛానల్స్ లో హడావిడి చేస్తున్నారు.

Jabardasth Kids also jump from ETV:

Jabardasth Comedians Jump To Star Maa Comedy Stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs