Advertisement
Google Ads BL

టెంక్షన్ లో పవన్ ఫాన్స్


ప్రస్తుతం సంక్రాంతికి, అలాగే అంతకుముందు వారం విడుదల కాబోతున్న సినిమాల జోరులో సోషల్ మీడియా తడిచి ముద్దవుతుంది. జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చూస్తే మిగతా మేకర్స్ ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14 న భోగి రోజున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 23 న అభిమానులే అతిధులుగా రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టీం ఇంకా షూటింగ్ చేసుకుంటుంది. జనవరి 12 నే భీమ్లా నాయక్ రిలీజ్ అంటూ మేకర్స్ పదే పదే హడావిడి చేస్తున్నారు.. ఇక్కడేమో ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటున్నారు.. ఇంకెప్పుడు షూటింగ్ ఫినిష్ చేసి.. ప్రమోషన్స్ లోకి దిగుతారు అంటూ పవన్ ఫాన్స్ లో అంతకంతకు టెంక్షన్ పెరిగిపోతుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన వికారాబాద్ లో పవన్ భీమ్లా నాయక్ షూటింగ్ లో పాల్గొన్న అప్ డేట్ బయటికి వచ్చిందో లేదో.. పవన్ ఫాన్స్ లో కంగారు మొదలైంది.. ఇంకెప్పుడు షూటింగ్ పూర్తి చేస్తారు.. ప్రమోషన్స్ లోకి దిగుతారో అని దిగాలు పడిపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ - రానా కాంబో అనగానే.. సినిమాపై భీబత్సమైన అంచనాలు పెరగడం, అప్ డేట్స్ అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఆడియన్స్ కి రీచ్ అవడంతో.. సినిమాపై భారీ అంచనాలే తెరపడ్డాయి. దానితో ఇంకా షూటింగ్ పూర్తి కానీ భీమ్లా నాయక్ సంక్రాతి రేస్ నుండి తప్పుకోవచ్చనే ఊహాగానాలు మళ్ళీ స్టార్ట్.

Pawan fans are tensed:

<span>Bheemla Nayak pulls out of sankranti race</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs