Advertisement
Google Ads BL

వైరల్: రాజమౌళి కాళ్ళు మొక్కిన బాలీవుడ్ హీరో


టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి అంటే.. బాలీవుడ్ ప్రేక్షకులకు అమితమైన ఇష్టం.. అందుకే అక్కడి ప్రేక్షకులు రాజమౌళి బాహుబలిని వసూళ్ల పరంగా అందనంత ఎత్తులో నించోబెట్టారు. కానీ బాలీవుడ్ హీరోలకి రాజమౌళి అంటే గౌరవం వచ్చినా, వున్నా బయటపడనివ్వరు. అయితే ఇప్పుడొక బాలీవుడ్ టాప్ హీరో రాజమౌళి కాళ్ళని మొక్కడం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వైరల్ అయ్యింది. ఆయనే బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చిన రణబీర్ కపూర్. అలియా భట్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, రణబీర్ కపూర్ కలిసి హైదరాబాద్ కి బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ కి వచ్చారు. అందులో నాగార్జున కూడా నటించడంతో.. నాగ్ కూడా ఆ ఈవెంట్ కి వచ్చారు. అదే ఈవెంట్ కి రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

Advertisement
CJ Advs

అయితే ఆ ఈవెంట్ కి రాజమౌళి వచ్చి డయాస్ ఎక్కగానే.. రణబీర్ కపూర్ మర్యాదగా, గౌరవంగా రాజమౌళి పాదాలకి నమస్కరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజమౌళి వద్దని వారిస్తున్నా రణబీర్ వినయంగా వంగి రాజమౌళి పాదాలకి నమస్కారం చేసాడు. బాహుబలితో ప్రపంచపటంలో ఇండియన్ సినిమాని అందనంత ఎత్తులో నించోబెట్టి.. ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాని ఎల్లలు దాటించబోతున్న రాజమౌళి అంటే ఎంత గౌరవం ఉంటే రణబీర్ అలా కాళ్ళు మొక్కడో అని టాలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రేక్షకులు అంటున్న మాట. రణబీర్ మాత్రమేకాదు.. ఆయన్ ముఖర్జీ కూడా రాజమౌళి కాళ్ళు మొక్కడం వైరల్ గా మారింది. ఏది ఏమైనా మన టాలీవుడ్ దర్శకుడికి బాలీవుడ్ కాళ్ళు మొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు.

Bollywood Hero touches director Rajamouli feet:

Bollywood actor Ranbir Kapoor touches director Rajamouli feet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs