Advertisement
Google Ads BL

అదొక్క సీనేనా.. చాలా కట్ చెయ్యాలి సామి


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఈ శుక్రవారం ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప మూవీ లో అల్లు అర్జున్ కేరెక్టర్ ఎంతగా హైలెట్ అయ్యిందో.. సెకండ్ హాఫ్ లో అంతగా మైనస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో చాలా సాగదీత సీన్స్ ప్రేక్షకులని బోర్ కొట్టించాయి.. సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్ట్ లు ఉండడం, వారిని పరిచయం చెయ్యడానికి ఓ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ప్రేక్షకులకి అంతగా నచ్ఛలేదు.. ఉన్నవారిని పర్ఫెక్ట్ గా వాడకుండా.. ఎక్కువ మందిని స్క్రీన్ మీద చూసేసరికి.. ఎవరు ఎవరో గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పార్ట్ టు పుష్ప ది రూల్ కోసం కథని దాయడం కోసం పుష్ప ద రైజ్ లోని సెకండ్ హాఫ్ అంతా అక్కర్లేని సీన్స్ తో ఇబ్బంది పెట్టారని అంటున్నారు. అంతేకాకుండా పుష్ప లోని ఓ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పడేలా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

రా కంటెంట్ తో తెరకెక్కించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక శ్రీవల్లి భుజం పై పుష్ప చేయి వేసి ఫోన్ మాట్లాడిన సీన్, తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ మీద పడినట్లుగా తీసిన షాట్ విషయంలో.. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందికర సీన్ గా అనిపించడంతో.. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దానితో పుష్ప ఎడిటింగ్ టీం రంగంలోకి దిగింది. ముందు సినిమా నుండి మెయిన్ గా ఆ సీన్ తొలగించాలని నిర్ణయించడం, అప్పుడే తీసెయ్యడం కూడా జరిగిపోయింది. రేపు ఆదివారం నుంచి ఎడిటెడ్ వెర్షన్ ని వేస్తారు.. కానీ ఇప్పుడు చాలామంది సెకండ్ హాఫ్ నుండి అదొక్క సీన్ కాదు సామి.. ఇంకా కట్ చెయ్యాల్సిన సీన్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Vulgar scene deleted from Pushpa:

Pushpa team decides to remove that controversial scene
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs