Advertisement
Google Ads BL

జక్కన్న బాలయ్య తో చెయ్యాలంటే భయం


బాలకృష్ణ తో సినిమా చేసే దర్శకులకు గట్స్ ఉండాలి.. లేదంటే బయట ఆయనకి తిక్క లెగిసి.. అభిమానుల మీద చెయ్యి చేసుకున్నట్టుగా దర్శకుల చెంప పగులుతుంది.. అని చాలా దర్శకులు మంది భయపడినట్టుగా.. టాప్ పాన్ ఇండియా దర్శకుడు జక్కన్న కూడా భయపడుతున్నాడు. అదే విషయాన్ని బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బాలకృష్ణ ఆహా ఓటిటి టాక్ షో అద్భుతంగా అదరగొట్టేస్తుంది. శుక్రవారం రావాల్సిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కాస్త ఆలస్యంగా శనివారం ఉదయం వచ్చింది. ఈ ఎపిసోడ్ లో రాజమౌళి తో పాటుగా కీరవాణి కూడా పాల్గొన్నారు. పాన్ ఇండియా దర్శకుడు, వినయంగా ఉండే రాజమౌళితో అల్లరి బాలయ్య అన్ స్టాపబుల్ ఎలా ఆడతాడో అనేది అందరిలో ఆసక్తి కలిగించింది.

Advertisement
CJ Advs

ఆ షో లో రాజమౌళి బాలకృష్ణ లోని రెండు షేడ్స్ ని చక్కగా వివరించారు. అందులో.. బాలయ్యని విసిగిస్తే.. చేతికి దొరికితే అభిమానులపై చెయ్యి చేసుకుంటారు.. అంటే దానికి బాలయ్య నా అభిమానులే అలా నా చెంపకి మీ చెయ్యి తాకించండి అంటారు అంటూ ఫన్నీ చేసాడు. ఇక మీరు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా రాగానే మర్యాదగా నిలబడి నమస్కారం చేస్తారు అది మీలోని గొప్పదనం.. అనగానే బాలకృష్ణ రాజమౌళి గారు మీ దర్శకత్వంలో నా సినిమా ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారనగానే.. నేను మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే టెన్షన్ సార్ అంటూ రాజమౌళి చెప్పారు.. సెట్స్ మీద నేను చాలా డిఫరెంట్ గా ఉంటాను. హీరో పరిస్థితిని పట్టించుకోను. వానకు తడుస్తున్నాడా? ఎండలో ఉన్నాడా? అనేది చూడను.. అక్కడ నేను నా షాట్ గురించే ఆలోచిస్తుంటాను. 

ఆ టైం లో ఎవరైనా గుడ్ మార్నింగ్ అన్నా సరే చికాకు వేస్తుంది. షాట్ రెడీ అయ్యేంతవరకు నా ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఆలా ఉండే నేను మీతో ఎలా వర్క్ చెయ్యగలను.. మీకేమో కోపం ఎక్కువ.. ఒకవేళ మీకు కోపం వస్తే.. అదే నా భయం అనగానే బాలకృష్ణ.. నేను దర్శకుల హీరోని అండి.. ఒక్కసారి కార్ వ్యాన్ దిగి.. షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టాను అంటే.. కనీసం గొడుగు కూడా వేసుకోను, డైరెక్టర్స్ ఎలా చెబితే అలా చేస్తా.. అంటూ ఫన్ చేసారు.

Balakrishna-Rajamouli show Unstoppable power:

Unstoppable: Balakrishna-Rajamouli episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs